PM Modi: సింగపూర్‌లో ప్రధానికి ఘన స్వాగతం..

PM Modi: సింగపూర్‌లో ప్రధానికి  ఘన స్వాగతం..
ఢోలు వాయించిన ప్రధాని మోదీకి .

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటన కొనసాగుతోంది. ఇవాళ బ్రూనై పర్యటనను ముగించుకొని సింగపూర్‌ వెళ్లారు. మధ్యాహ్నం సమయంలో సింగపూర్‌ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్‌ అయ్యారు. ఈ సందర్భంగా మోదీకి ఘన స్వాగతం లభించింది. ప్రవాస భారతీయులు మోదీకి గ్రాండ్‌ వెల్‌కమ్‌ పలికారు. మోదీకి ఓ మహిళ రాఖీ కూడా కట్టింది. ఈ సందర్భంగా అక్కడ బస చేస్తున్న హోటల్‌ వద్ద మోదీ ఢోలు వాయించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

మోదీ బ్రూనై, సింగపూర్‌ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. రెండు రోజుల ద్వైపాక్షిక పర్యటనలో భాగంగా మంగళవారం బ్రూనై వెళ్లారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధానికి 40 ఏళ్లయిన సందర్భంగా మోదీ ఈ పర్యటన చేపట్టిన వదిషయం తెలిసిందే. ద్వైపాక్షిక పర్యటన నిమిత్తం భారత ప్రధాని బ్రూనై వెళ్లడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ సందర్భంగా బ్రూనై రాజు హాజీ హసనల్‌ బోల్కియాను మోదీ భేటీ అయ్యారు. ఈ పర్యటనలో ఇరు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు జరిగినట్లు భారత విదేశాంగ శాఖ అధికారులు వెల్లడించారు. రెండు దేశాల మధ్య త్వరలోనే నేరుగా విమాన సర్వీసులను ప్రారంభించేందుకు అంగీకారం కుదిరినట్లు తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి చెన్నై నుంచి బ్రూనై రాజధానికి విమాన సర్వీసులు ప్రారంభించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు పేర్కొన్నారు.

భారత్-సింగపూర్ వ్యూహాత్మక భాగస్వామ్య పురోగతిపై నేతలు సమీక్షించుకుంటారని.. ప్రాంతీయ మరియు ప్రపంచ సమస్యలపై అభిప్రాయాలను మార్పిడి చేసుకుంటారని బ్రూనై, సింగపూర్‌కు బయలుదేరే ముందు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటనలో తెలిపింది.

Tags

Next Story