Vande bharat express :5 వందే భారత్ రైళ్లను ప్రారంభించిన మోదీ

బీహార్, గోవా, జార్ఖండ్ రాష్ట్రాలకు తొలిసారి వందే భారత్ రైళ్ల సర్వీసులు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు ఒకేసారి 5 వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. మధ్యప్రదేశ్ పర్యటనలో ఉన్న ప్రధానని భోపాల్ సిటీలోని రాణి కమలాపతి రైల్వే స్టేషన్ నుంచి 5 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు పచ్చ జండా ఊపారు.

సెమీ హై స్పీడ్ వందే భారత్ రైళ్ల ప్రస్థానంలో మరో కీలక ఘట్టం చోటు చేసుకుంది. ఒకేరోజు ఐదు కొత్త వందే భారత్ రైళ్లు పట్టాలెక్కాయి. పలు రాష్ట్రాల్లోని ముఖ్య నగరాలను అనుసంధానించేలా ఈ రైళ్ల సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.





రైళ్లకు పచ్చజెండా ఊపడానికి ముందు ప్రధాని అక్కడి రైలు సిబ్బంది, వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణానికి సిద్ధమైన చిన్నారులతో కాసేపు ముచ్చటించారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, గవర్నర్ మంగుభాయ్ సి పటేల్, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, జ్యోతిరాదిత్య సింధియా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


ప్రధాని ప్రారంభించిన ఐదు ఎక్స్‌ప్రెస్ రైళ్లలో రాణి కమలాపతి-జబల్‌పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్, ఖజురహో-భోపాల్-ఇండోర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్, మడగావ్ -ముంబై వందే భారత్ ఎక్స్‌ప్రెస్, ధార్వాడ్-బెంగళూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్, హటియా-పాట్నా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఉన్నాయి.

ఇందులో రెండు రైళ్ళను భౌతికంగానూ మూడు రైళ్ళను వర్చువల్ గాను ప్రారంభించారు. ఇప్పటివరకు మన దేశంలో 18 వందే భారత్ రైళ్లు ఉండగా ఇప్పుడు ప్రారంభించిన ఈ ఐదు రైళ్లతో కలిపి వీటి సంఖ్య 23 కి చేరుకుంది.




రాణి కమలాపతి- జబల్‌పూర్ భారత్ ఎక్స్‌ప్రెస్ మధ్యప్రదేశ్‌లోని మహాకౌషల్ ప్రాంతం అంటే జబల్‌పూర్ నుంచి భోపాల్ సెంట్రల్ రీజిన్ ను అనుసంధానిస్తుంది. రెండు నగరాల మధ్య గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ రైలు ప్రస్తుతం ఉన్న ఫాస్ట్ రైళ్ల కంటే 30 నిమిషాల ముందే గమ్యానికి చేరుకుంటుంది.

మధ్యప్రదేశ్ లో మూడో సెమీ-హైస్పైడ్ రైలు మాల్వా ప్రాంతం (ఇండోర్), బుందేల్‌ ఖండ్ ప్రాంతం (ఖుజరహో), సెంట్రల్ రీజియన్ (భోపాల్) మధ్య నడుస్తుంది. మహాబలేశ్వర్, మాండు, మహేశ్వర్, ఖజురహో, పన్నా వంటి పర్యాటక ప్రాంతాలకు ఈ రైలు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

గోవాకు తొలి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ అయిన ముంబై-మడగావ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ముంబై ఛత్రపతి మహరాజ్ టెర్మినస్, గోవా మడగావ్ స్టేషన్ల మధ్య నడుస్తుంది. శుక్రవారం మినహా వారంలో ఆరు రోజుల పాటు ఈ రైలు నడుస్తుంది. సుమారు గంట ప్రయాణ సమయం ఆదా అవుతుంది.

హతియా-పాట్నా వందేభారత్ ఎక్స్‌ప్రెస్ జార్ఖాండ్, బీహార్‌కు తొలి వందేభారత్ రైలు.

ఇక కర్ణాటకలోని ధార్వాడ్-బెంగళూరు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ కీలక సిటీలైన ధార్వాడ్, బుబ్బళ్ళి, దేవన్‌గెరలను బెంగళూరుతో కలుపుతుంది. ఇతర రైళ్ల కంటే ఈ వందేభారత్ రైలులో ప్రయాణించడం వల్ల 30 నిమిషాల ప్రయాణ సమయం ఆదా అవుతుంది. కర్ణాటకకు ఇది రెండో వందేభారత్ రైలు కాగా, మొదటి రైలు చెన్నై, బెంగళూరు, మైసూరు మధ్య నడుస్తుంది

Tags

Read MoreRead Less
Next Story