Narendra Modi: జాతీయ సమైక్యత పట్ల సర్దార్ వల్లభాయ్ పటేల్ నిబద్ధత ఆదర్శం..

Narendra Modi: జాతీయ సమైక్యత పట్ల సర్దార్ వల్లభాయ్ పటేల్ నిబద్ధత ఆదర్శం..
148వ జయంతి సందర్భంగా మోదీ నివాళులు

భారత తొలి కేంద్ర హోంశాఖ మంత్రి సర్దార్‌ వల్లభాయ్ పటేల్ అద్వితీయమైన స్ఫూర్తిని, దూరదృష్టితో కూడిన రాజనీతిజ్ఞతను దేశ ప్రజలు ఎప్పటికీ స్మరించుకుంటారని ప్రధాని మోదీ అన్నారు. జాతీయ సమైక్యత పట్ల ఆయన నిబద్ధత మార్గదర్శకంగా కొనసాగుతోందని చెప్పారు.

సర్దార్‌ పటేల్ సేవకు ఎప్పటికీ రుణపడి ఉంటామని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. సర్దార్‌ వల్లభాయ్ పటేల్ 148వ జయంతి సందర్భంగా గుజరాత్‌ కెవడియాలోని పటేల్ ఐక్యతా విగ్రహం వద్ద ప్రధాని నివాళులు అర్పించారు. అనంతరం అక్కడ జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన ప్రధాని మోదీ....రానన్న 25 ఏళ్లు భారత్‌కు అత్యంత కీలకమైనవని అన్నారు. జమ్మూకశ్మీర్ ప్రజలు ఉగ్రనీడ నుంచి బయటపడ్డారన్న ఆయన ఆర్టికల్ 370 రద్దుతో అది సాధ్యమైందన్నారు. గతంలో బుజ్జగింపు రాజకీయాలు చేసిన వారు తీవ్రవాదంపై దృష్టి సారించలేదని ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. అనంతరం ఏక్తా నగర్‌ నుంచి అహ్మదాబాద్‌ మధ్య తొలి హెరిటేజ్ రైలును ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు. మూడు బోగీలతో స్టీమ్ ఇంజిన్ తరహాలో ఉన్న ఈ రైలు సర్దార్ పటేల్ స్మారక చిహ్నం వద్దకు పర్యాటకులను తీసుకురానుంది.


అక్టోబర్ 31, దేశ వ్యాప్తంగా ఐక్యతా దివస్ వేడుకలు జరుగుతున్నాయి. ఉక్కుమనిషిగా పేరొంది..దేశ తొలి హోంమంత్రి సర్దార్‌ వల్లభాయ్ పటేల్ జయంతిని కేంద్ర ప్రభుత్వం ఐక్యతా దివస్ గా జరుపుతోంది. దీంట్లో భాగంగా ఐక్యతా దివస్ సందర్భంగా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఢిల్లీలో ఐక్యతా పరుగును ప్రారంభించారు. అలాగే గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోడీ అక్కడి ఏక్తానగర్ లో జరుగుతున్న ఐక్యతా దివస్ వేడుకల్లో పాల్గొన్నారు. నేషనల్ యూనిటీ పరేడ్ లో పాల్గొన్నారు ప్రధాని మోదీ. 148వ జయంతి సందర్భంగా పటేల్ ను స్మరించుకుంటు నర్మదా నది తీరంలోని స్టాట్యూ ఆఫ్ యునిటీ విగ్రహానికి నివాళులు అర్పించారు. పటేల్ విగ్రహ పాదాలకు పాలాభిషేకం చేసారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు..ఏక్తానగర్ కు వచ్చిన ప్రజలు పటేల్ సాబ్ గొప్ప విగ్రహాన్ని చూసి ఆనందభరితులు అవుతున్నారని అన్నారు. ఇక్కడికొచ్చే ప్రజలు కేవలం విగ్రహాన్ని చూడటమే కాదు..సర్దార్ సాహెబ్ జీవితం, త్యాగం,ఏక భారతదేశాన్ని నిర్మించడంలో ఆయన చేసిన కృషిని సలాములు చేస్తున్నారని అన్నారు. ఈ విగ్రహ నిర్మాణ కథే ‘ఏక్ భారత్ – శ్రేష్ఠ భారత్’ స్ఫూర్తికి అద్దం పడుతోందన్నారు.

కాగా ఈ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ దేశ సమగ్రత పరిరక్షణకు కృషి చేస్తామని అక్కడి అధికారులు, ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. 2014 నుంచి అక్టోబర్‌ 31న కేంద్రప్రభుత్వం జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా నర్మదా తీరంలో ఏక్తా దివస్ వేడుకలలో త్రివిధ దళాల పరేడ్ ఆకట్టుకుంది. ఈ వేడుకను పురస్కరించుకుని ప్రధాని మోదీ సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అచంచలమైన స్ఫూర్తిని, దూరదృష్టితో కూడిన రాజనీతిజ్ఞతను, అసాధారణమైన అంకితభావాన్ని మనం గుర్తుంచుకోవాలి. జాతీయ సమగ్రత పట్ల ఆయన నిబద్ధత మనకు మార్గనిర్దేశం చేస్తుంది. పటేల్ సేవకు మేము ఎప్పటికీ రుణపడి ఉంటాము” అని ట్వీట్ పేర్కొన్నారు.


Tags

Next Story