PM Modi: 12 రాష్ట్రాలు..10 రోజులు..

లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడనున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. వచ్చే 10 రోజుల్లో... 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పర్యటించటం సహా..... 29 కార్యక్రమాల్లో పాల్గొంటారు. తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, పశ్చిమ బంగాల్, బిహార్, జమ్ముకశ్మీర్, అసోం, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, దిల్లీలో పర్యటించనున్నారు. రేపు తెలంగాణ, తమిళనాడులో.. పలు అభివృద్ధి పనులకు..శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు తర్వాత బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. ఈనెల 6న బిహార్, బంగాల్ లో పర్యటించనున్న ప్రధాని ఈనెల 7న జమ్ముకశ్మీర్, దిల్లీలో జరిగే వేర్వేరు కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ఇవాళ్టి 4 నుంచి 10 రోజుల పాటు.. 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మోదీ షెడ్యూల్ ఖరారు అయ్యింది. తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, బెంగాల్, బీహార్, జమ్మూకాశ్మీర్, అసోం, అరుణాచల్ ప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ప్రధాని పర్యటన ఇవాళ్టి నుంచి ప్రారంభంకానుంది. తెలంగాణలో వరుసగా రెండు రోజులు పర్యటించనున్నారు.
ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో పర్యటనలో పాల్గొంటారు ప్రధాని మోదీ. ఉదయం డిల్లీ నుంచి నాగ్‌పూర్.. అక్కడి నుంచి ఆదిలాబాద్ చేరుకుంటారు ప్రధాని మోదీ. రాష్ట్ర ప్రభుత్వం తరుపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానికి స్వాగతం పలకనున్నారు. ఉదయం 10.30 నిమిషాలకు ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో అధికారికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు. రూ. 6,697 కోట్ల అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేస్తారు ప్రధాని మోదీ. రేపు సంగారెడ్డిలో పర్యటింటి పలు ప్రాజెక్టులను జాతికి అంకితం ఇవ్వనున్నారు.
మార్చి 6న కోల్‌కతాలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక 7న జమ్మూకశ్మీర్‌లో పర్యటించాక, ఢిల్లీకి చేరుకుని ఓ ఈవెంట్‌లో పాల్గొంటారు. అటు 8, 9 తేదీల్లో మొదటి రోజు ఢిల్లీలో మర్నాడు అరుణాచల్ ప్రదేశ్‌లోని అభివృద్ధి ప్రాజెక్టులను ఆవిష్కరిస్తారు. అనంతరం పశ్చిమబెంగాల్‌లోని శిలిగుడిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఇక 10న ఉత్తర్‌ప్రదేశ్‌లో పర్యటించనున్న ప్రధాని మోదీ, 11న ఢిల్లీలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. 12న గుజరాత్‌లోని సబర్మతి, రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లలో పలు కార్యక్రమాలకు హాజరవుతారు. 13న గుజరాత్, అస్సాంలో మూడు ముఖ్యమైన సెమీ కండక్టర్ల ప్రాజెక్టులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేస్తారు. ఇలా ఎన్నికల వేళ 10 రోజుల్లో 12 రాష్ట్రాలు ప్రధాని మోదీ సుడిగాలి పర్యటన చేయనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com