MODI: మెట్రోలో మోడీ జర్నీ... వెబ్‌సిరీస్‌లపై యువతతో చర్చ

MODI: మెట్రోలో మోడీ జర్నీ... వెబ్‌సిరీస్‌లపై యువతతో చర్చ
ఢిల్లీ మెట్రోలో ప్రధాని మోడీ ప్రయాణం... వెబ్‌సిరీస్‌లు, సైన్స్‌పై విద్యార్థులతో చర్చ.. యువత ఏ అంశం వదిలిపెట్టదని చమత్కరించిన ప్రధాని..

ఢిల్లీ యూనివర్సిటీలో జరుగుతున్న శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలకు ప్రధానమంత్రి మోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యూనివర్సిటీకి వెళ్లేందుకు ఆయన ఢిల్లీ మెట్రోలో ప్రయాణించారు. ఓ సామన్యుడిలా మిగిలిన ప్రయాణికులతో పాటు మెట్రో రైలులో ప్రధాని ప్రయాణించారు. విద్యార్థులు, తోటి ప్రయాణికులతో ముచ్చటించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మోడీ.. మెట్రో రైలులో తన ప్రయాణ అనుభవాలను పంచుకున్నారు.



ఓటీటీలో వచ్చిన కొత్త వెబ్‌ సిరీస్‌ల నుంచి సైన్స్‌ వరకు చాలా విషయాలపై విద్యార్థులతో చర్చించారని మోదీ తెలిపారు. ఇక్కడి విద్యార్థుల్లానే తాను మెట్రోలో ప్రయాణించానని మోదీ వివరించారు. విద్యార్థులతో చాలా విషయాలు మాట్లాడానని, సైన్స్ గురించి.. ఓటీటీలో వచ్చిన కొత్త వెబ్‌సిరీస్‌ల గురించి వారితో చర్చించానని ప్రధాని వెల్లడించారు. విద్యార్థులు ఏ అంశాన్ని వదిలిపెట్టరని చమత్కరించారు. విద్యార్థులు సూర్యుడి గురించి మాట్లాడుతారు.. వెబ్‌ సిరీస్‌ల గురించి కూడా మాట్లాడతారు. మీరు ఏ సినిమా చూశారు.. OTTలో ఆ వెబ్ సిరీస్ బాగుంది.. మీరు చూశారా... ఇలా విద్యార్థులతో మాట్లాడేందుకు చాలా విషయాలు ఉన్నాయని ప్రధాని అన్నారు. యువకులతో కలిసి మెట్రో ప్రయాణం చేయడం తనకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. మెట్రో ప్రయాణ ఫొటోలను మోడీ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. బీజేపీ కూడా వీడియోను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు, వీడియోలు వైరల్‌ అవుతున్నాయి.



మోడీ ఢిల్లీ విశ్వవిద్యాలయ పర్యటన వేళ.. భద్రతా బలగాలు కట్టుదిట్ట ఏర్పాట్లు చేశాయి. మూడంచెల్లో తనిఖీలు నిర్వహించాయి. అందుకోసం పారామిలిటరీ బలగాలు సహా వెయ్యిమంది సిబ్బందిని మోహరించినట్లు పోలీసులు తెలిపారు.

1922లో సెంట్రల్‌ లెజిస్లేటివ్‌ అసెంబ్లీ చట్టం ప్రకారం దిల్లీ యూనివర్సిటీని స్థాపించారు. దీన్ని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎమినెన్స్‌గా గుర్తించింది. 2022 నాటికి ఈ విశ్వవిద్యాలయానికి వందేళ్లు పూర్తవ్వడంతో గతేడాది మే 1వ తేదీన శతాబ్ది ఉత్సవాలను ప్రారంభించారు. ఏడాది పాటు జరిగిన ఈ వేడుకలు నేటితో ముగియనున్నాయి. ఈ ముగింపు ఉత్సవాలకు ప్రధాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Tags

Read MoreRead Less
Next Story