Rajasthan: ఏటీఎం దొంగలు 48 గంటల్లో అరెస్ట్

డబ్బులు కోసం దొంగలు ఏమన్నా చేస్తారు.. కానీ వారిని పట్టుకోవడానికి పోలీసులు మాత్రం పెద్ద రిస్క్ తీసుకోరు అని కనుకుంటాం. కానీ పోలీసులు ఏదన్నా కేసు సీరియస్ గా తీసుకున్నారంటే తగ్గేదే లేదు. ఇలాంటి సంఘటనే రాజస్థాన్ లో జరిగింది.. తాజాగా గోపాల్‌గఢ్ పట్టణంలో సుమారు రూ.35 లక్షలతో నింపిన ఏటీఎం మిషన్‌ను దుండగులు ధ్వంసం చేసి ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై చర్యలు తీసుకున్న పోలీసులు.. ప్రధాన నిందితుడు పప్పి అలియాస్ మక్సూద్‌ను 48 గంటల్లో అరెస్టు చేశారు.
కేసువివరాలలోకి వెళితే.. సెప్టెంబర్ 3న గోపాల్‌గఢ్ పట్టణంలోని ఎస్‌బీఐ బ్యాంక్‌కు చెందిన రూ.34 లక్షల 76 వేల 500 ఉన్న ఏటీఎం మిషన్‌ను కొంతమంది పగులగొట్టారు. ఈ ఘటన తెల్లవారుజామున జరిగింది. సీసీ కెమెరాలను కూడా దుండగులు ధ్వంసం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు వ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.జిల్లాలో దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అంతేకాకుండా MOB బృందాన్ని పిలిచి ఆధారాలు సేకరించారు. అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజీని, గోపాల్‌గఢ్‌కు అనుసంధానించబడిన అన్ని రహదారులను స్కాన్ చేశారు. సాంకేతిక, ai ఆధారంగా నిందితులను గుర్తించారు.
ఏఎస్పీ నేతృత్వంలో డీగ్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ పలు బృందాలను ఏర్పాటు చేశారు. మేవాత్ ప్రాంతంలోని కొండలు, జుర్హారా ప్రాంతం మరియు అంతర్ రాష్ట్ర సరిహద్దులో ఉన్న హర్యానాలోని ప్రాంతాలలో దాడులు నిర్వహించారు. రెండు గ్రామాలను అడుగడుగునా వెతికారు. నిందితుడు పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నంలో ఇంటిపైకప్పు నుండి దూకాడు. దాంతో అతని కాలికి గాయమైంది. చివరికిగ్రామ భండారా పోలీస్ స్టేషన్ జురారాలో రూ. 34 లక్షల 76 వేల 500తో పాటు ఎటిఎంను కూల్చివేసిన నిందితుడు జహరుద్దీన్ అలియాస్ తిద్దా కుమారుడు పప్పు అలియాస్ మక్సూద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మొత్తానికి నిందితులను 48 గంటల్లో పట్టుకోవడంలో పోలీసులు విజయం సాధించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com