Ddudhsagar: టూరిస్టులను గుంజీలు తీయించిన పోలీసులు
టూరిస్ట్ లకు పనిష్‌మెంట్ విధించారు రైల్వే పోలీసులు. కర్ణాటక,గోవా సరిహద్దులో ఉన్న దూద్ సాగర్ జలపాతాలను దగ్గరగా చూసేందుకు నిబంధనలకు విరుద్ధంగా రైల్వే పట్టాలపై నడుచుకుంటూ వెళుతున్న పర్యాటకులను రైల్వే పోలీసులు అడ్డుకుని వారితో గుంజీలు తీయించారు. రైలులో గోవా వెళ్తుండగా కనిపించే అందమైన పర్యటక దృశ్యం దూద్ సాగర్ జలపాతాలు.దూరం నుంచి చూస్తేనే అంత ఆహ్లాదంగా ఉండే ఈ జలపాతాలను దగ్గరగా చూడాలని కొందరు పర్యాటకులు ఉత్సాహం చూపుతుంటారు.గతంలో అడవి నుంచి జలపాతాలను చేరేందుకు దారి ఉండేది. అయితే ఇటీవల మైనాపీ జలపాతాల దగ్గర ఇద్దరు వ్యక్తులు నీటి ప్రవాహంలో కొట్టుకుపోవడంతో ఈ దారిని మూసేశారు. దీంతో పర్యాటకులు దూధ్ సాగర్ చేరుకోవడానికి రైలు పట్టాల మీద నడుచుకుంటూ వెళుతున్నారు.
అయితే ఇది ప్రమాదమని రైల్వే పోలీసులు అనేకసార్లు పర్యాటకులను హెచ్చరిస్తున్నా పట్టించుకోవడం లేదు. హాలిడేస్‌లో అయితే వందల సంఖ్యలో పర్యాటకులు ఈ దారిలో వెళ్తూ రైల్వే పోలీసుల కంటపడ్డారు. దీంతో నిబంధనలను అతిక్రమించిన వందల టూరిస్టులతో గుంజీలు తీయించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com