Manipur: మందుగుండుతో పోలీసులకు పట్టుబడ్డ ఎమ్మెల్యే మేనల్లుడు

Manipur: మందుగుండుతో పోలీసులకు పట్టుబడ్డ ఎమ్మెల్యే మేనల్లుడు
మణిపూర్‭లో మందుగుండుతో పోలీసులకు పట్టుబడ్డ ఎమ్మెల్యే మేనల్లుడు

మైతీ, కుకీల తెగల మధ్య ఐదు నెలలుగా సాగుతున్న ఘర్షణలో ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌ మండిపోతుంది. ఆందోళనకారులతో పాటు శాంతిభద్రతలను కాపాడేందుకు మోహరించిన సాయుధ బలగాల కర్కశానికి సామాన్యులు బలైపోతున్నారు. కొన్నిసార్లు హింసాత్మక సంఘటనలు తగ్గుముఖం పట్టినట్టే పట్టి, మళ్లీ పెద్ద ఎత్తున చెలరేగుతున్నాయి. తాజాగా మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో ఆయుధాలు, మందుగుండు సామగ్రితో ఒక వ్యక్తి అరెస్టు అయ్యారు. విచారణలో ఆ వ్యక్తి మణిపూర్ ఎమ్మెల్యే మేనల్లుడు అని తేలింది. పోలీసుల విచారణపై అవగాహన ఉన్న అధికారులు ఆదివారం ఈ సమాచారం ఇచ్చారు. మణిపూర్‌లో మే నెల నుంచి హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయి.


హిందుస్థాన్ టైమ్స్ నివేదిక ప్రకారం.. అనుమానిత ఉగ్రవాది జూన్ నుంచి మయన్మార్‌లో ఉన్న ఉగ్రవాద సమూహంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు.కొద్దీ రోజుల క్రితం నిషేధిత సంస్థ ‘కాంగ్లీ యావోల్ కనా లూప్’ (కేవైకేఎల్)లో క్రియాశీలక సభ్యుడిని అరెస్టు చేసినట్లు మణిపూర్ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. అతని నుంచి 9 ఎంఎం బెరెట్టా యుఎస్ కార్ప్ పిస్టల్, ఏడు రౌండ్లు (మందుగుండు సామగ్రి), దోపిడీ డబ్బును స్వాధీనం చేసుకున్నారు. అయితే పోలీసులు అతని గుర్తింపు లేదా అతనితో సంబంధం ఉన్న వ్యక్తుల సమాచారాన్ని వెల్లడించలేదు. ఈ అనుమానితుడు మణిపూర్ ఎమ్మెల్యే మేనల్లుడు అని కూడా చెప్పలేదు. అయితే ఎప్పుడు ఆ వార్తను హిందుస్థాన్ టైమ్స్ విశ్వసనీయ సమాచారం అంటూ బయట పెట్టింది. మరోవైపు భారతదేశంలో మణిపూర్‌ విలీనాన్ని వేర్వేరు మిలిటెంట్‌ సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. 1949 అక్టోబరు 15న జరిగిన విలీనాన్ని నిరసిస్తూ ఆదివారం ఈ సంస్థలు రాష్ట్రవ్యాప్తంగా సమ్మె నిర్వహించాయి. దీంతో సాధారణ జనజీవనం ప్రభావితమైంది. వ్యాపార సంస్థలు, మార్కెట్లను మూసివేసినట్లు అధికారులు తెలిపారు. కొన్ని ప్రైవేటు వాహనాలు మినహా ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించింది. ఐదు నిషిద్ధ మిలిటెంట్‌ సంస్థలు కలిసి ఈ సమ్మెకు పిలుపునిచ్చాయి. భారత్‌లో విలీనానికి నాడు మణిపూర్‌ మహారాజు బుద్ధచంద్ర సంతకం చేయడమే రాష్ట్రంలో అశాంతికి కారణమని మిలిటెంట్‌ గ్రూపులు ఆరోపిస్తున్నాయి.


marovaipuఇంటర్నెట్ సేవల నిషేధం అక్టోబర్ 16 సాయంత్రం వరకు అమలులో ఉంటుందని మణిపూర్ ప్రభుత్వ హోం శాఖ పేర్కొంది. హింసాత్మక కార్యకలాపాలను నిరోధించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దేశవ్యతిరేక, సంఘవ్యతిరేక శక్తుల కార్యకలాపాలను అడ్డుకునేందుకు, శాంతి, మత సామరస్యాన్ని కాపాడేందుకు, ప్రాణనష్టాన్ని నిరోధించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా తప్పుడు సమాచారం, వదంతులు వ్యాప్తి చెందకుండా నిరోధించడం ద్వారా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా శాంతిభద్రతల పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని హోం శాఖ ఉత్తర్వుల్లోతెలిపింది.


Tags

Read MoreRead Less
Next Story