POLITICS: తమిళ రాజకీయాల్లో 'సినిమా నాయకత్వం'

POLITICS: తమిళ రాజకీయాల్లో సినిమా నాయకత్వం
X
తమి­ళ­నా­డు రా­జ­కీ­యాల రూ­ట్లు తెర వెనక సి­ని­మా తారల నుం­చి తె­ర­పై నా­య­కుల వరకూ సా­గి­న­వే.

తమి­ళ­నా­డు రా­జ­కీ­యాల రూ­ట్లు తెర వెనక సి­ని­మా తారల నుం­చి తె­ర­పై నా­య­కుల వరకూ సా­గి­న­వే. తె­ర­మీద ని­లి­చిన అధి­నే­తల పి­లు­పు­తో ప్ర­జల ఓటు బ్యాం­కు­లు మా­రి­పో­యిన సం­ద­ర్భా­లు ఎన్నో. అయి­తే ఇప్పు­డు మరో­సా­రి అదే చర్చ. ఈసా­రి తె­ర­పై ఉన్న­ది 'ద­ళ­ప­తి' వి­జ­య్.. రా­జ­కీయ తె­ర­పై­కి సీఎం అభ్య­ర్థి­గా బరి­లో­కి ది­గు­తు­న్నా­రు. అన్నా­దు­రై, కరు­ణా­ని­ధి, ఎం­జీ­ఆ­ర్, జయ­ల­లిత వంటి నా­య­కు­లు తమ సినీ పు­నా­దు­ల­తో ప్ర­జ­ల్లో నమ్మ­కం ఏర్ప­ర­చు­కో­గ­లి­గా­రు. వారు నటిం­చిన పా­త్ర­లు, మా­ట్లా­డిన డై­లా­గు­లు ప్ర­జల జీ­వి­తా­ల­ను నా­ట­కీ­యం­గా ప్ర­భా­వి­తం చే­శా­యి. 1967 లో అన్నా­దు­రై ఆధ్వ­ర్యం­లో కాం­గ్రె­స్ ఓడి­పో­వ­డ­మే ఇం­దు­కు శ్రీ­కా­రం. తర్వాత ఎం­జీ­ఆ­ర్ సి­ని­మా ఇమే­జ్ ఆధా­రం­గా మూడు సా­ర్లు సీఎం కు­ర్చీ అధి­రో­హిం­చా­రు. అయి­తే అన్ని స్టా­ర్‌­లు రా­జ­కీ­యం­గా వి­జ­యం సా­ధిం­చ­లే­దు. శి­వా­జీ గణే­ష­న్, వి­జ­య్ కాం­త్, రజి­నీ­కాం­త్, కమల్ హా­స­న్ వంటి వారు ప్ర­జ­ల్లో అభి­మా­నా­న్ని మూ­ట­గ­ట్టు­కు­న్నా, ఓట­ర్ల మద్ద­తు మా­త్రం పొం­ద­లే­క­పో­యా­రు. ఇవ­న్నీ "ప్ర­ము­ఖత వేరు.. ప్ర­భా­వి­తం వేరు" అనే వా­స్త­వా­న్ని రు­జు­వు చే­శా­యి.

విజయ్‌కు పరీక్ష

ఇప్పు­డు వి­జ­య్ సీఎం అభ్య­ర్థి­గా బరి­లో­కి ది­గిన వేళ ఆయన ముం­దు రెం­డు పె­ద్ద ప్ర­శ్న­లు ఉన్నా­యి. ఒకటి అభి­మా­నం­తో గె­లు­పు సా­ధ్య­మే­నా? రెం­డు డీ­ఎం­కే–అన్నా­డీ­ఎం­కే మధ్య రా­జ­కీ­యం­గా వి­సి­గిన ప్ర­జ­లు ప్ర­త్యా­మ్నా­యా­న్ని సి­ద్ధం­గా చూ­స్తు­న్నా­రా? అని. వి­జ­య్ కు యు­వ­త­లో పా­పు­లా­రి­టీ ఉంది. సి­ని­మా ద్వా­రా రా­జ­కీయ చై­త­న్యం కలి­గిం­చేం­దు­కు చే­సిన ప్ర­య­త్నా­లు గు­ర్తిం­పు పొం­దు­తు­న్నా­యి. 'మె­ర్స­ల్', 'స­ర్కా­ర్' వంటి సి­ని­మా­ల్లో ప్ర­భు­త్వ వ్య­తి­రే­కత, అవి­నీ­తి­పై ని­బ­ద్ధత స్ప­ష్టం­గా కన­బ­డిం­ది. అయి­తే రా­జ­కీయ అను­భ­వం లే­ని­దే, పా­ర్టీ కే­డ­ర్ స్థి­రం­గా లే­కుం­డా అసెం­బ్లీ లె­వె­ల్ పోటీ ఎలా జర­గ­నుం­ద­న్న­ది అస­లైన పరీ­క్ష.

పునాది ద్రవిడ వాదమే

తమి­ళ­నా­డు­లో రా­జ­కీయ సా­మా­జిక చై­త­న్యా­ని­కి పు­నా­ది ద్ర­వి­డ­వా­ద­మే. సా­మా­జిక న్యా­యం, ప్రాం­తీయ గర్వం, స్థా­నిక సమ­స్యల పట్ల స్ప­ష్ట­మైన వై­ఖ­రి లే­కుం­డా రా­జ­కీయ పట్టు సా­ధ్యం కాదు. ప్ర­జ­ల­కు ఇప్పు­డు కా­వ­ల­సిం­ది ‘హీరో’ కాదు .. హే­తు­బ­ద్ధ నా­య­కు­డు. సమ­స్య­లు వినే నేత, పరి­ష్కా­రా­లు సూ­చిం­చే వ్య­క్తి­త్వం. వి­జ­య్ ముం­దు­న్న దారి గు­లా­బీ పు­వ్వు­ల­తో కాదు.. అవి­నీ­తి, ప్ర­భు­త్వ వ్య­తి­రే­కత, వంటి అం­శా­ల­తో నిం­డి ఉంది. ఆయన ఆగ­మ­నం రా­జ­కీ­యం­గా కొ­త్త అధ్యా­యా­న్ని తె­రి­చి­నా, అది వి­జ­య­వం­తం అవు­తుం­దా లేదా అనే­ది.. ప్ర­జల హృ­ద­యా­ల్లో స్థి­ర­ప­డే సా­మ­ర్థ్యం­పై­నే ఆధా­ర­ప­డి ఉం­టుం­ది. ఇది ఒక స్టా­ర్‌ పవ­ర్‌ కాదు .. ప్ర­జా నమ్మ­కం గె­ల్చు­కు­నే పో­రా­టం. ఇదే వి­జ­య్ కు ని­జ­మైన సవా­ల్.

జయలలిత

కన్నడ నటి జయలలిత తమిళ రాజకీయాల్లో పెను సంచలనం. మొదట ఎంజీఆర్ నేతృత్వంలోని అన్నాడీఎంకే పార్టీలో చేరారామె. ఎంజీఆర్ మరణానంతరం ఎన్నో సమస్యలు ఎదురైనా తన బలమైన నాయకత్వంతో మళ్లీ పార్టీ సభ్యులను కూడగట్టి పోరాడి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. జయలలిత తమిళనాడుకు ఆరుసార్లు సీఎంగా ఉన్నారు.

విజయకాంత్

నటుడు విజయకాంత్ 2005లో పార్టీని స్థాపించారు. 2011లో ప్రతిపక్ష నేతగా కూడా పనిచేశారు. అయితే ఆ తర్వాతి సంవత్సరాల్లో ఆయన పార్టీ తన చరిష్మాను నిలబెట్టుకోవడంలో విఫలమైంది. దీంతో జయలలితతో విభేదాలు కూడా వచ్చాయి. విజయ కాంత్ గతేడాది డిసెంబర్ 28న కన్నుమూశారు.

కమల్ హాసన్

నటుడు కమల్ హాసన్ నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పటికీ సినిమాల్లో నటిస్తున్నారాయన. 2018లో కమల్ హాసన్ ‘మక్కల్ నిధి మాయం’ పార్టీని స్థాపించారు. 2019 లోక్‌సభ ఎన్నికలను ఆయన ఎదుర్కొన్నారు. కానీ గెలవలేదు. ఇప్పటికీ రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు లోకనాయకుడు.

ఖుష్బు

కన్నడతో పాటు పలు భాషా చిత్రాల్లో నటించిన నటి ఖుష్బు గత 14 ఏళ్లుగా రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నారు.

దళపతి విజయ్

తమిళ ప్రస్తుత స్టార్ నటుడు దళపతి విజయ్ ఇంతస్తే (ఫిబ్రవరి 2) తన సొంత రాజకీయ పార్టీని ప్రకటించారు. విజయ్ పార్టీ పేరు తమిళగ వెట్రి కళగం. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో విజయ్‌ పోటీ చేయనున్నారని తెలుస్తోంది.

Tags

Next Story