Lok Sabha Election 2024: దేశవ్యాప్తంగా మొదలైన లోక్‌సభ రెండో దశ పోలింగ్.
సార్వత్రిక ఎన్నికల సమరంలోరెండో విడత పోలింగ్ ప్రారంభమైంది. 13 రాష్ట్రాల పరిధిలోని 88 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. కేరళలోని 20 లోక్ సభ స్థానాలకు ఒకేసారి పోలింగ్ జరుగుతుండగా... కర్ణాటకలో 28 లోక్‌సభ స్థానాలకుగాను... 14చోట్ల పోలింగ్ మొదలైంది. రాజస్థాన్‌లోని 25 స్థానాలకు తొలి విడతలో 12 సీట్లకు పోలింగ్ జరగ్గా... ఇవాళ మిగిలిన 13 చోట్ల పూర్తి కానుంది. ఉత్తరప్రదేశ్ , మహారాష్ట్రలో.. 8 చొప్పున, అసోం, బిహార్ లో ఐదేసి.. మధ్యప్రదేశ్ లో ఆరు.. బంగాల్ , ఛత్తీస్‌గఢ్ లో మూడేసి... త్రిపుర, మణిపూర్ , జమ్మూకశ్మీర్ లో ఒక్కో స్థానానికి ఓటింగ్ జరుగుతోంది. పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.
13 రాష్ట్రాల పరిధిలోని 88 లోక్ సభ స్థానాలకు జరుగుతున్న పోలింగ్‌లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎన్నికల సంఘం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. జమ్ముకశ్మీర్‌లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజలు తెల్లవారుజాము నుంచే భారీగా బారులు తీరారు.SPOT
త్రిస్సూర్‌లో ఎన్‌డీఏ అభ్యర్థి, ప్రముఖ నటుడు సురేష్ గోపి ఓటు వేశారు. బెంగళూరులో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి దంపతులు ఓటు వేశారు. పౌరలందరూ వచ్చి ఓటు వేయాలని.... పట్టణ ప్రజల ఓటింగ్ తక్కువగా నమోదవుతోందని... అందరూ వచ్చి తమ హక్కును వినియోగించుకోవాలని సుధామూర్తి పిలుపునిచ్చారు. రాజస్థాన్‌లో భాజపా నేత వసుంధర రాజే ఓటు హక్కు వినియోగించుకున్నారు. కర్ణాటకలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన మామయ్యతో కలిసి ఓటు వేశారు.కేరళలో ముఖ్యమంత్రి పినరయి విజయన్... వరుసలో నిలబడి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఏడీఆర్ (అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్) విశ్లేషణ ప్రకారం.. కర్ణాటక కాంగ్రెస్ నేత, మాండ్యా నుంచి పోటీ చేస్తున్న వెంకటరమణే గౌడ అత్యంత ధనవంతుడుగా ఉన్నారు. నామినేషన్ ప్రకారం ఆయన ఆస్తుల విలువ రూ.622 కోట్లుగా ఉంది. ఇక కర్ణాటకలోనే కాంగ్రెస్ అభ్యర్థి, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తమ్ముడు డీకే సురేశ్ ఆస్తుల విలువ రూ.593 కోట్లు. దీంతో అత్యంత సంపన్న అభ్యర్థుల్లో రెండో స్థానంలో ఉన్నారు. బెంగళూరు రూరల్ నుంచి ఆయన బరిలో ఉన్నారు. ఇక మథుర లోక్‌సభ స్థానం నుంచి తిరిగి పోటీ చేస్తున్న బీజేపీ ఎంపీ హేమమాలిని ఆస్తుల విలువ రూ.278 కోట్లు అని ప్రకటించారు. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత సంజయ్ శర్మ రూ.232 కోట్లతో నాలుగవ సంపన్న అభ్యర్థిగా ఉన్నారు. ఇక హెచ్‌డీ కుమారస్వామి రూ. 217.21 కోట్లతో ఐదవ స్థానంలో నిలిచారు.
మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన లక్ష్మణ్ నాగోరావ్ పాటిల్ అనే అభ్యర్థి తన ఆస్తుల విలువ కేవలం రూ.500 అని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. కేరళలోని కాసరగోడ్ నుంచి మరొక స్వతంత్ర అభ్యర్థి రాజేశ్వరి కేఆర్ తన ఆస్తుల విలువ రూ.1,000 మాత్రమే అని పేర్కొన్నారు. మహారాష్ట్రలోని అమరావతి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్న పృథ్వీసామ్రాట్ తన ఆస్తి విలువ రూ.1400 అని చెప్పారు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ నుంచి పోటీ చేస్తున్న షహనాజ్ బానో అనే వ్యక్తి తన ఆస్తుల విలువ రూ.2000 అని, కేరళలోని కొట్టాయం నుంచి పోటీ చేసిన వీపీ కొచుమోన్ అనే అభ్యర్థి రూ.2,230 ఆస్తులను అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com