Jammu and Kashmir : జమ్ముకశ్మీరులో ఎన్నికలకు సిద్ధం: కేంద్రం

Jammu and Kashmir : జమ్ముకశ్మీరులో ఎన్నికలకు సిద్ధం: కేంద్రం
సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్ర ప్రభుత్వం...కేంద్ర పాలిత ప్రాంత హోదా శాశ్వతం కాదని స్పష్టీకరణ...

జమ్మూకశ్మీర్‌లో ఏ క్షణమైనా ఎన్నికలు(Elections ) నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు( anytime from now) కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు(Supreme Court)కు తెలిపింది. ఆర్టికల్ 370 రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ల(Article 370 Hearing)పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ DY చంద్రచూడ్( Chief Justice DY Chandrachud) నేతృత్వంలోని ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. ఈ పిటిషన్‌పై విచారణలో భాగంగా జమ్ముకశ్మీర్‌కు కేంద్ర పాలిత ప్రాంత హోదా శాశ్వతం కాదని, ఆగస్టు 31న రాజకీయపరమైన అంశాలపై సమగ్ర ప్రకటన చేస్తామని ఈనెల 29న కేంద్రం చెప్పింది. ఆ క్రమంలో ప్రకటన చేసిన కేంద్రం జమ్ముకశ్మీర్‌లో మూడు దశల్లో ఎన్నికలు జరుగుతాయని తెలిపింది.


మొదటి దశలో పంచాయితీ ఎన్నికలు(elections for panchayats),రెండోదశలో మున్సిపల్ ఎన్నికలు(municipal bodies), ఆ తర్వాత శాసనసభ ఎన్నికలు(legislative assembly polls) జరుగుతాయని సొలిసిట్ జనరల్ తుషార్ మోహతా( Solicitor General Tushar Mehta) సుప్రీంకోర్టుకు వివరించారు. ఇందుకు సంబంధించి పోలింగ్ తేదీలను కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలు ప్రకటించాలని తెలిపారు. ఓటర్ల జాబితాను అప్ డేట్ చేయాలని పేర్కొన్నారు.

ఈ క్రమంలో సొలిసిటర్ జనరల్ తుషార్‌ మెహతా, సీనియర్ న్యాయవాది కపిల్‌ సిబల్(Kapil Sibal) మధ్య వాడీవేడీ వాదనలు జరిగాయి. జమ్మూకశ్మీర్‌(Jammu and Kashmir)కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించడంపై మాత్రం ప్రభుత్వం కచ్చితమైన సమయాన్ని ఇవ్వలేకపోయిందని తుషార్‌ మెహతా అన్నారు. 2018లో 52 బంద్‌లు జరిగాయని, ప్రస్తుతం వాటి సంఖ్య జీరో అని తెలిపారు. అయితే ఈ మాటలను కపిల్ సిబల్(Kapil Sibal) తోసిపుచ్చారు. 5వేల మందిని గృహనిర్బంధం చేశారని, 144 సెక్షన్‌ విధించారని, అంతర్జాలంపై ఆంక్షలు ఉన్నాయని గుర్తు చేశారు. ఇక బంద్‌లు ఎలా జరుగుతాయని, ఈ కోర్టు వీటన్నింటిని గుర్తించిందని అన్నారు. ప్రజలు కనీసం ఆసుపత్రులకు వెళ్లలేకపోతున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో బంద్‌లు ఎలా ఉంటాయని మెహతా వ్యాఖ్యలను సిబల్‌ తప్పుపట్టారు.


అటు జమ్ముకశ్మీర్ రాష్ట్ర హోదా పునరుద్ధరణకు కాలపరిమితి ఉందా అని ధర్మాసనం ప్రశ్నించగా ఇందుకు అవసరమైన నియామవళిని రూపొందిస్తున్నట్టు సొలిసిటర్ జనరల్ తెలిపారు. ఇందుకు కొంత సమయం పడుతుందని వెల్లడించారు. రెండురోజుల క్రితం పిటిషనర్ల వాదనలు విన్న చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం.. జమ్మూ కశ్మీర్‌(Jammu and Kashmir)లో ఎన్నికల ప్రజాస్వామ్యం ఎంతో ముఖ్యమని పేర్కొంది.

Tags

Read MoreRead Less
Next Story