NDA Alliance Meet: భాజాపా నేత మురళీధర్ తో భేటీ అయిన పవర్ స్టార్

ఎన్డీఏ పక్షాల సమావేశం కోసం ఢిల్లీ వెళ్ళిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ క్రమంలో ఢిల్లీలోని పెద్దలతో భేటీ అవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కేంద్ర మంత్రి, భాజాపా అంధ్ర ప్రదేశ్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మురళీ ధర్ ను పవన్ కల్యాణ్, నాదెండ్ర మనోహర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనతో అల్పాహార విందులో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ పరిస్థితులు రాజకీయాలు పొత్తుల వ్యవహారం గురించి మురళీధరన్ తో చర్చించినట్లు తెలుస్తోంది.
ఎన్డీఏ సమావేశం అనంతరం దేశానికి బలమైన నాయకత్వం అవసరం అని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. 2014లో శ్రీ నరేంద్ర మోడీ నాయకత్వంతో దేశం మరింత పటిష్టమైంది జనసేనాని కొనియాడాారు. ఈ కార్యక్రమానికి పవన్ కల్యాణ్ తో పాటూ జనసేన పార్టీ పీఏసీ నాదెండ్ల మనోహర్ కూడా హాజరయ్యారు. దేశానికి పటిష్ట నాయకత్వం వల్ల వచ్చే జరిగే మేలు ఏమిటి అన్నది భారతదేశం అంతా గమనిస్తోందని పవర్ స్టార్ అన్నారు. ఎన్డీఏ పక్షాల సమావేశంలో భవిష్యత్తులో ఎన్డీఏ కూటమి ఏ విధంగా భారతదేశాన్ని ముందుకు తీసుకువెళ్లాలి..? దేశ ప్రజలకు అత్యున్నత జీవన విధానం అందించేందుకు, అభివృద్ధి సాధించేందుకు ఎలాంటి విధానాలు తీసుకురావాలి అన్నదానిపై చర్చ జరిగినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఎలాంటి చర్చ జరగలేదని, వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అనుసరించాల్సిన వ్యూహం, పొత్తులు, సీట్ల సర్దుబాటు మీద మాట్లాడలేదని స్పష్టం చేశారు. మొత్తం భారతదేశ రాజకీయాలు, భవిష్యత్తు వ్యూహాలపైనే ప్రధానంగా చర్చ జరిగిందని అన్నారు.
Tags
- pawan kalyan
- pawan kalyan speech
- pawan kalyan delhi tour
- ap cm pawan kalyan
- pawan kalyan meets muralidharan
- bjp leader muralidhar rao
- pawan kalyan delhi tour to meet modi
- bjp leader muralidhar on pawan kalyan
- vangaveeti radha about pawan kalyan
- janasena chief pawan kalyan
- janasena pawan kalyan ys jagan
- muralidhar rao press meet
- janasena pawan kalyan ap cm ys jagan
- vangaveeti radha meets pawan kalyan
- pawan kalyan varahi vehical specialties
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com