Prahlad Modi: నిరసన బాట పట్టిన నరేంద్ర మోడీ సోదరుడు ప్రహ్లాద్ మోడీ..

X
By - Divya Reddy |2 Aug 2022 8:15 PM IST
Prahlad Modi: ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ప్రధాని నరేంద్ర మోడీ సోదరుడు ప్రహ్లాద్ మోడీ ధర్నా చేపట్టారు.
Prahlad Modi: దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రధాని నరేంద్ర మోడీ సోదరుడు, అఖిల భారత చౌక ధరల దుకాణాల డీలర్ల సంఘం వైస్ ప్రెసిడెంట్ ప్రహ్లాద్ మోడీ ధర్నా చేపట్టారు. జీవన వ్యయం పెరిగిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో రేషన్ దుకాణాలు నడవడం కష్టంగా మారిందన్నారు. రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేసే బియ్యం, గోధుమలు, పంచదారపై కేంద్ర ప్రభుత్వం తమకిచ్చే కమిషన్‌లో కిలోకు 20 పైసలు మాత్రమే పెంచడం క్రూరమైన హాస్యమని ప్రహ్లాద్ మోడీ విమర్శించారు. తమకు ఉపశమనం కల్పించి.. ఆర్థిక కష్టాలను తొలగించాలని కేంద్రాన్ని ఆయన డిమాండ్ చేశారు. బుధవారం AIFPSDF జాతీయ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించి తమ తదుపరి కార్యాచరణను నిర్ణయిస్తామన్నారు ప్రహ్లాద్ మోడీ.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com