Prajwal Revanna: వీడియోల లీక్‌పై కుమారస్వామి తీవ్ర ఆరోపణలు

Prajwal Revanna: వీడియోల లీక్‌పై కుమారస్వామి తీవ్ర ఆరోపణలు
ప్రజ్వల్ రేవణ్ణ వీడియోల 25 వేల పెన్‌డ్రైవ్‌లు పంచారు..

ప్రజ్వల్‌ రేవణ్ణ వ్యవహారంపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు అభ్యంతరకర వీడియోలున్న 25వేల పెన్‌డ్రైవ్‌లను పంచారని విమర్శించారు. ఈ కుట్ర వెనక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఉన్నారని ఆరోపించారు. మొదట బెంగళూరు రూరల్‌ నియోజకవర్గంలో ఏప్రిల్‌ 21న ఒక పెన్‌డ్రైవ్‌ను విడుదల చేశారన్న ఆయన ఆ రోజు రాత్రి ఒక వాట్సాప్‌ ఛానల్‌ను క్రియేట్ చేశారని తెలిపారు. ప్రజ్వల్ రేవణ్ణ వీడియోలు వీక్షించేందుకు ఈ ఛానల్‌ను ఫాలో అవండని అందులో మెసేజ్ పెట్టారని చెప్పారు.ఆ వీడియోలలో ఉన్న దేనినీ తాను సమర్థించడం లేదని పేర్కొన్నారు. చట్టపరంగా తప్పు చేసినవారికి శిక్ష పడాలన్న కుమారస్వామి వీడియోలను వ్యాప్తి చేసిన నలుగురు వ్యక్తులపై కేసు నమోదై 15 రోజులు అవుతున్న ఇంతవరకు ఎలాంటి చర్యలు లేవని మండిపడ్డారు. సిట్‌ను ఏర్పాటు చేసినప్పుడు న్యాయం జరుగుతుందని తాను భావించానని కానీ ఇప్పుడు అలా అనిపించడం లేదని వ్యాఖ్యానించారు.

ఎన్నికల ముందు అభ్యంతరకర వీడియోలున్న 25 వేల పెన్‌డ్రైవ్‌లను పంచారని కుమారస్వామి విమర్శించారు. ఈ కుట్ర వెనక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఉన్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ సమాజంలో జరగకూడని ఒక అంశం గురించి మాట్లాడేందుకు తాను ఇక్కడికి వచ్చానని తెలిపారు. మొదట బెంగళూరు రూరల్‌ నియోజకవర్గంలో ఒక పెన్‌డ్రైవ్‌ను విడుదల చేశారని.. ఇది ఏప్రిల్ 21న జరిగిందని తెలిపారు. ఆ రోజు రాత్రి ఒక వాట్సాప్‌ ఛానల్‌ను క్రియేట్ చేశారని.. ప్రజ్వల్ రేవణ్ణ వీడియోలు వీక్షించేందుకు ఈ ఛానల్‌ను ఫాలో అవ్వండని అందులో మెసేజ్ పెట్టారన్నారు.

వీడియోల్లో ఉన్న దేనినీ తాను సమర్థించడం లేదని కుమారస్వామి చెప్పారు. చట్టపరంగా తప్పు చేసినవారికి శిక్ష పడాలన్నారు. అలాగే ఆ వీడియోలను పంచిన విషయంలో నలుగురు వ్యక్తులపై కేసు నమోదైందని చెప్పారు. కానీ ఇంతవరకు ఎలాంటి చర్యలు లేవని ఆరోపించారు. సిట్‌ను ఏర్పాటు చేసినప్పుడు న్యాయం జరుగుతుందని తాను భావించానని.. కానీ ఇప్పుడు అలా అనిపించడం లేదన్నారు. అధికారంలో ఉన్నవారు సిట్ సభ్యుల్ని వారి ఇంటికి పిలిచి, కేసు గురించి మాట్లాడుతున్నారని కుమారస్వామి ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తోన్న ముగ్గురు జేడీఎస్ అభ్యర్థులు ఓడిపోతారని సిద్ధరామయ్య ధీమాగా చెప్పారని, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆ వ్యాఖ్యలు పలు అనుమానాలకు తావిస్తున్నాయన్నారు. అలాగే పోలీసు అధికారుల సహాయంతో ఆ పెన్‌డ్రైవ్‌ల పంపిణీ జరిగిందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇదిలా ఉంటే ప్రజ్వల్‌ రేవణ్ణ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఇప్పటికే ఆయనకు సిట్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఇక లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసింది. ప్రస్తుతం ప్రజ్వల్.. హాసన్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. కానీ ఆయన ప్రచారం చేయకుండా.. పరారీలో ఉన్నాడు.

Tags

Read MoreRead Less
Next Story