REVANNA: ఎమ్మెల్యే రేవణ్ణకు జ్యుడీషియల్ కస్టడీ

మహిళ కిడ్నాప్ కేసులో అరెస్టైన మజీ ప్రధాని HD దేవెగౌడ కుమారుడు ఎమ్మెల్యే రేవణ్ణను ప్రత్యేక దర్యాప్తు బృందం-సిట్ అధికారులు జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. నాలుగు రోజుల పాటు పోలీసు కస్టడీలో ఉన్న రేవణ్ణను అధికారులు అదనపు మెట్రోపాలిటన్ న్యాయమూర్తి ముందు హాజరు పరిచారు. కోర్టు అతనికి మే 14 వరకు రిమాండ్‌ను విధించింది. ఈ మేరకు సిట్ అధికారుల రేవణ్ణను తమ కస్టడీలోకి తీసుకున్నారు. సెషన్స్ కోర్టులో ఆయన దాఖలు చేసిన పిటిషన్ విచారణను గురువారానికి న్యాయమూర్తి వాయిదా వేశారు. గతంలో రేవణ్ణ ఇంట్లో పనిచేసిన తన తల్లి కిడ్నాప్‌కు గురైందని బాధితురాలి కుమారుడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో కిడ్నాప్, అక్రమంగా బంధించటం వంటి సెక్షన్ల కింద రేవణ్ణపై కేసు నమోదైంది. మరోవైపు రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్ రేవణ్ణపై లైంగిక వేధింపుల ఆరోపణలపై సిట్ అధికారులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ప్రజ్వల్ విదేశాల్లో తలదాచుకున్నారు.
మరోవైపు రేవణ్ణ సహాయకుడైన రాజశేఖర్‌కు చెందిన కళేనల్లిలోని ఫార్మ్ హౌస్‌లో ఆ మహిళను నిర్బంధించినట్లు సిట్ పోలీసులు గుర్తించారు. అక్కడకు వెళ్లి ఆమెను కాపాడారు. బెంగళూరుకు తీసుకువచ్చిన తర్వాత ఆమె స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయనున్నారు. కాగా, అసభ్యకర వీడియోల వ్యవహారంలో ఆరోపణలున్న రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్ రేవణ్ణ విదేశాలకు పారిపోయాడు. ఈ కేసుపై కూడా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తోసిపుచ్చిన శివకుమార్
హాసన సెక్స్ కుంభకోణం కేసులో తనపై వచ్చిన ఆరోపణలను కర్ణాటక ఉప ముఖ్యమంత్రి DK శివకుమార్ తోసిపుచ్చారు. అభ్యంతరకర వీడియోలు వైరల్ కావడం వెనుక... ప్రజ్వల్ రేవణ్ణ బాబాయ్, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి ఉన్నారని.... ఆరోపించారు. కుమార స్వామి బ్లాక్‌మెయిలింగ్ కింగ్ అని, ఈ మొత్తం కథకు దర్శకుడు, నిర్మాత, ప్రధాన పాత్రధారి ఆయనేనని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఆ పెన్‌డ్రైవ్ వ్యవహారం గురించి కుమారస్వామికి మొత్తం తెలుసునని దీనిపై కొందరు ఇప్పటికే మాట్లాడుతున్నారని శివకుమార్ తెలిపారు. కుమారస్వామి తన రాజీనామా అడుగుతున్నారని చూస్తుంటే వక్కళిగల నాయకత్వం కోసం పోటీ ఉన్నట్లు కనిపిస్తోందన్నారు.ఆయన కోరుకున్నట్టుగా నన్ను రాజీనామా చేయనివ్వండని ఎద్దేవా చేశారు. రాజకీయంగా ఒకరి తర్వాత ఒకరిని తొక్కేయడమే కుమారస్వామి పని అని ఆరోపించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com