Prashant Kishor: సోనియాగాంధీతో ప్రశాంత్ కిషోర్ వరుస సమావేశాలు.. నాలుగు రోజుల్లో మూడుసార్లు..

Prashant Kishor: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సమావేశాలు కొనసాగుతూనే ఉన్నాయి. గత నాలుగు రోజుల్లో మూడుసార్లు సోనియాతో చర్చలు జరిపారు పీకే. శనివారం, సోమవారం నాటి మీటింగ్‌లకు కొనసాగింపుగా ఇవాళ కూడా సోనియా-పీకే భేటీ కొనసాగుతోంది. సమావేశమైన ప్రతిసారి గంటల కొద్దీ మాట్లాడుకుంటున్నారు. సోనియా-ప్రశాంత్ కిషోర్ సమావేశాల్లో కాంగ్రెస్ సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, కమల్‌నాథ్ కూడా పాల్గొంటున్నారు.
2024 ఎన్నికలకు కాంగ్రెస్ సన్నద్దత, అందుకోసం చేయాల్సిన పనులు, తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన ప్రజెంటేషన్‌పైనా, ఒకవేళ పార్టీలో చేరితే ప్రశాంత్ కిషోర్‌కు ఎలాంటి పాత్ర ఉండాలన్న దానిపైనా అధ్యయనం చేయడానికి ముకుల్ వాస్నిక్, దిగ్విజయ్ సింగ్, రణ్‌దీప్ సుర్జేవాలా, కేసీ వేణుగోపాల్‌తో కమిటీ ఏర్పాటు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com