Prashant Kishor: బిహార్ ఎన్నికల్లో పోటీ చేయను .. ప్రశాంత్ కిషోర్ కీలక నిర్ణయం!

‘జన్ సురాజ్’ అధినేత, పొలిటికల్ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 2025 బీహార్ ఎన్నికల్లో తాను పోటీ చేయనని తెలిపారు. తాను ఎన్నికల్లో పోటీ చేయకున్నా.. పార్టీ కోసం మాత్రం పనిచేస్తానని వెల్లడించారు. ఈ మేరకు పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. పార్టీ ప్రయోజనం కోసం తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు. బీహార్ ఎన్నికలు రెండు దశల్లో (నవంబర్ 6, 11) జరగనున్నాయి. నవంబరు 14న ఫలితాలు వెల్లడి కానున్నాయి.
‘నేను బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని పార్టీ నిర్ణయించింది. తేజస్వి యాదవ్‌కు వ్యతిరేకంగా రాఘోపూర్ నుంచి మరో అభ్యర్థిని పార్టీ ప్రకటించింది. పార్టీ ప్రయోజనాల కోసం మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. నేను పోటీ చేస్తే పార్టీపై నిర్వహణపై ప్రభావం పడనుంది’ అని ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ వెల్లడించారు. 150 కంటే తక్కువ సీట్లు వస్తే (120 లేదా 130 అయినా) తనకు ఓటమి లాంటిదే అని ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు. 150 కంటే ఎక్కువ సీట్లు గెలిస్తే పార్టీ దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతుందన్నారు. దేశంలోని అత్యంత అభివృద్ధి చెందిన 10 రాష్ట్రాలలో ఒకటిగా బీహార్ ఉండాలని తన లక్ష్యం అని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com