Sri Lanka Elections : శ్రీలంక పార్లమెంటరీ ఎన్నికల్లో ఎన్‌పీపీకి విజయావకాశాలు

Sri Lanka Elections : శ్రీలంక పార్లమెంటరీ ఎన్నికల్లో ఎన్‌పీపీకి విజయావకాశాలు
X
నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్‌కు 5 శాతం ఓట్లు

శ్రీలంక పార్లమెంటు ఎన్నికల్లో అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే పార్టీ భారీ విజయం దిశగా దూసుకెళ్తున్నది. ప్రాథమిక ఫలితాల ప్రకారం గురువారం జరిగిన ఓటింగ్‌లో ఆయన నేతృత్వంలోని నేషనల్‌ పీపుల్స్‌ పవర్‌ సంకీర్ణ పార్టీ 63 శాతం ఓట్లతో తిరుగులేని ఆధిక్యాన్ని సంపాదించింది.

శ్రీలంక పార్లమెంటరీ ఎన్నికల్లో ఎన్‌పీపీ విజయావకాశాలు బలంగా ఉన్నాయి. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 11 గంటల వరకు వెలువడిన ఫలితాల్లో ఎన్‌పీపీకి 70 శాతం ఓట్లు రాగా, ప్రత్యర్థి పార్టీ సమైఖ్య జన బలవేగయకు 11 శాతం, రణిల్ విక్రమసింఘే మద్దతు ఉన్న నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్‌కు 5 శాతం ఓట్లు వచ్చాయి. ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్స్ ప్రకారం.. శ్రీలంకలోని దక్షిణ ప్రావిన్స్ రాజధాని గాలేలో ఎన్‌పిపికి 70 శాతానికి పైగా ఓట్లు వచ్చాయి. దీని కారణంగా ఆ పార్టీకి చారిత్రాత్మక విజయం లభించే అవకాశం ఉంది. సెప్టెంబర్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికలతో పోలిస్తే ఎన్‌పీపీ ఓట్ల శాతం పెరిగినట్లు నిపుణులు భావిస్తున్నారు.

శ్రీలంక పార్లమెంటులో మొత్తం 225 సీట్లు ఉన్నాయి, వీటిలో ఏ పార్టీకి మెజారిటీ రావాలంటే 113 సీట్లు అవసరం. అయితే జనాభా ప్రాతిపదికన 196 స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయగా, మిగిలిన 29 మంది అభ్యర్థులను జాతీయ జాబితా ద్వారా ఎంపిక చేస్తారు. 2022లో ఆర్థిక సంక్షోభం తర్వాత జరగనున్న తొలి పార్లమెంట్ ఎన్నికలు ఇది. శ్రీలంకలో మొత్తం 2.1 కోట్ల జనాభాలో 1.7 కోట్ల మంది ఓటు హక్కు కలిగి ఉన్నారు. ఎన్నికల బందోబస్తు కోసం 90 వేల మంది పోలీసులు, ఆర్మీ సిబ్బందిని మోహరించారు. ఇప్పటి వరకు వచ్చిన నివేదికల ప్రకారం ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని, చిన్నపాటి ప్రచార ఘటనలు మినహా పెద్దగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకోలేదన్నారు.

అధికార ఎన్‌పీపీకి సాధారణ మెజారిటీ 113 సీట్లు వస్తాయని ఎన్నికల విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కొలంబోలో ఓటింగ్ తర్వాత, తన పార్టీ మెజారిటీ సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు, అయినప్పటికీ సంపూర్ణ మెజారిటీ అవసరం లేదని ఆయన చెప్పారు. తమ ప్రభుత్వం ప్రతిపాదించిన చట్టాలు సామాన్య పౌరులకు మేలు చేసేవిగా ఉంటాయని, పార్లమెంటులో విస్తృత మద్దతు లభిస్తుందని ఆయన స్పష్టం చేశారు. శ్రీలంకను ఏకం చేయడానికి తన నిబద్ధతను దిసానాయకే వ్యక్తం చేశారు. తమిళులు అధికంగా ఉన్న ఉత్తర ప్రాంతంతో సహా అన్ని ప్రాంతాల ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోవడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.

Tags

Next Story