Vajpayee: దేశాన్ని నవ శకం వైపు నడిపిన నాయకుడు వాజ్‌పేయి

మాజీ ప్రధాని, దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయి వర్థంతి( Vajpayee on 5th death anniversary) సందర్భంగా ఢిల్లీలోని 'సదైవ్ అటల్' స్మారక చిహ్నం( Sadaiv Atal Memorial) వద్ద ప్రముఖులు నివాళులర్పించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Murmu), ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్(Vice President Jagdeep Dhankar), ప్రధాని మోదీ( PM Modi ), లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్ సహా కేంద్రమంత్రులు నివాళులు అర్పించారు. వాజ్‌పేయి కుటుంబ సభ్యులు కూడా నివాళులు అర్పించారు. మాజీ ప్రధాని అటల్ జీ వర్థంతి సందర్భంగా యావత్తు దేశం ఆ మహానీయునికి నివాళులర్పిస్తోంది.
అటల్ బిహారీ వాజ్ పేయి దేశానికి ప్రధానమంత్రిగా సేవలందించి.. నిస్వార్థ రాజకీయనాయకుడిగా అందరి మన్ననలు పొందారు. 1924 డిసెంబర్ 25వ తేదీన మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో వాజ్‌పేయి జన్మించారు. విలక్షణమైన వ్యక్తిత్వం ఆయన సొంతం. పార్టీలకు అతీతంగా అందరూ అభిమానించే నాయకుడిగా ఆయన కీర్తి పొందారు. తన నాయకత్వ లక్షణాలతో నవ భారత నిర్మాణానికి బాటలు వేసిన నాయకుడు వాజ్‌పేయి.
1996లో 13 రోజులు, 1998-99లో 13 నెలలు, 1999 నుంచి2004 వరకు ఐదేళ్ల పాటు పూర్తికాలం ప్రధానమంత్రిగా వాజ్‌పేయి సేవలందించారు. మొరార్జీ దేశాయ్ నేతృత్వంలోని జనతా ప్రభుత్వంలో భారత విదేశాంగ శాఖ మంత్రిగా అటల్ జీ పనిచేశారు. జనతా ప్రభుత్వం కూలిపోయినప్పడు, భారతీయ జనసంఘ్ లోని ఇతర సభ్యులతో కలిసి భారతీయ జనతా పార్టీ పేరుతో కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. ఆతర్వాత 15 ఏళ్ల పాటు దేశమంతా పర్యటించి పార్టీ విస్తరణలో కీలక భూమిక పోషించారు అటల్ బిహారీ వాజ్ పేయి. తన రాజకీయ జీవితంలో 10 సార్లు లోక్ సభ, 2 సార్లు రాజ్యసభకు అటల్ జీ ఎన్నికయ్యారు. 1957లో బలరాంపూర్ నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఆయన లోక్ సభకు ఎన్నికయ్యారు. అటల్ బిహారీ వాజ్ పేయి అద్భుతమైన వక్తృత్వం, ఉచ్చారణ ద్వారా పార్లమెంటులో తనదైన ముద్ర వేశారు.
అటల్ జీ ప్రసంగ నైపుణ్యం అప్పటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూతో సహా చాలా మంది మనస్సులు గెలుచుకుంది. 1996 సార్వత్రిక ఎన్నికల తర్వాత బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించగా.. అతిపెద్ద పార్టీగా అవతరించినా బీజేపీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. దీంతో మెజారిటీ నిరూపించుకోవడానికి ఇతర పార్టీల మద్దతు సేకరించలేకపోవడంతో 13 రోజుల తర్వాత అటల్ జీ రాజీనామా చేయాల్సి వచ్చింది.
అటల్ జీ హయాంలోనే ప్రపంచానికి తెలియకుండా ఐదు అణుపరీక్షలను నిర్వహించి అణ్వాయుధ దేశంగా భారత్ అవతరించింది. మూడు నెలల పాటు జరిగిన కార్గిల్ యుద్ధం అటల్ జీ ప్రధానిగా ఉన్నప్పుడే జరిగింది. కార్గిల్ విజయం వాజ్ పేయి రాజకీయ ప్రతిష్టను మరింత పెంచింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com