President's rule: జమ్మూకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన రద్దు

జమ్మూకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన రద్దు అయ్యింది. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఓ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో జమ్మూలో ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అయ్యింది. కాగా, 2018లో బీజేపీ, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ కూటమి నుంచి బీజేపీ వైదొలడంతో అక్కడ ప్రభుత్వం కూలిపోయింది. అనంతరం గవర్నర్ పాలన, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలనను విధించింది.
పదేళ్ల తరువాత జమ్మూకశ్మీర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమి విజయం సాధించి, ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. ఈ మేరకు ఎల్జీకి ఓ లేఖను సమర్పించారు ఎన్సీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా. దీనితో రాష్ట్రపతి పాలనను కేంద్రం ఎత్తివేసింది. జమ్ముకశ్మీర్‌లో 2018లో బీజేపీ, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ కూటమి ప్రభుత్వం పతనమైంది. దీనితో శాసన సభను రద్దు చేసి, 6నెలలపాటు గవర్నర్ పాలను విధించారు. ఆ కాలం ముగియడం వల్ల కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలనను విధించింది. తరువాత రాష్ట్రపతి 2019అక్టోబర్ 31న రాష్ట్రపాతి పాలనను పొడిగిస్తూ ఓ నోటిఫికేషన్ను జారీ చేశారు. అది ఇప్పటి వరకు కొనసాగింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com