PM Modi: : కెనడాలో జీ7 సదస్సు..అనంతరం కెనడాకు పయనం

రెండు దేశాల పర్యటన నిమిత్తం భారత ప్రధాని నరేంద్రమోదీ నేడు బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన తొలుత సైప్రస్‌లో పర్యటిస్తారు. అయితే, అక్కడ ఆయన అధికారిక కార్యక్రమాలకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అక్కడ పర్యటన ముగిసిన అనంతరం కెనడాకు బయలుదేరి వెళ్తారు.
కెనడాలో మంగళవారం జరగనున్న జీ7 (గ్రూప్ ఆఫ్ సెవెన్) దేశాల కూటమి శిఖరాగ్ర సమావేశంలో మోదీ పాల్గొంటారు. ప్రపంచంలోని ఏడు ప్రధాన పారిశ్రామిక దేశాలైన కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్ సభ్యులుగా ఉన్న ఈ కూటమి సమావేశంలో పలు అంతర్జాతీయ, ఆర్థిక, రాజకీయ అంశాలపై చర్చలు జరగనున్నాయి.
కెనడాతో పాటు ప్రధాని మోడీ సైప్రస్, క్రొయేషియా దేశాల్లో కూడా పర్యటిస్తారు. జూన్ 16-17 తేదీల్లో కెనడాలోని కననాస్కిస్‌లో జరిగే జీ-7 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ఈ శిఖరాగ్ర సమావేశంలో, ఇంధన భద్రత, సాంకేతికత మరియు ఆవిష్కరణలతో సహా కీలకమైన ప్రపంచ సమస్యలపై భారతదేశం యొక్క వైఖరిని ప్రధాన మంత్రి భారత వైఖరి తెలియచేస్తారని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. జూన్ 15 నుంచి 16 వరకు మోడీ సైప్రస్ పర్యటనలో ఉంటారు. ఆ తర్వాత 16-17 వరకు జీ-7 సమావేశంలో పాల్గొంటారు. దీని తర్వాత జూన్ 18న క్రొయేషియాలో పర్యటిస్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com