Maha Kumbh mela 2025: కుంభమేళాలో ప్రధాని మోడీ పుణ్య స్నానం

Maha Kumbh mela 2025:  కుంభమేళాలో ప్రధాని మోడీ పుణ్య స్నానం
X
గంగా మాతకు ప్రత్యేక ప్రార్థనలు

ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ప్రయాగ్ రాజ్ చేరుకున్న ఆయన త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరించారు. అనంతరం గంగా మాతకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దేశ శ్రేయస్సు కోసం మోడీ ప్రార్ధించారు. మోడీ వెంట యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వచ్చారు. ప్రధాని మోదీ మరియు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఏరియల్ ఘాట్ నుంచి మహాకుంభ్ వరకు పడవ ప్రయాణం చేశారు. ప్రధాని పర్యటన వేళ భద్రతా సిబ్బంది ఆ ప్రాంతమంతా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

మహాకుంభమేళా ఫిబ్రవరి 26 వరకు కొనసాగనున్నది. దేశ విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు కుంభమేళాలో పాల్గొంటున్నారు. అన్ని దార్లు ప్రయాగ్ రాజ్ వైపే పయనిస్తు్న్నాయి. రోడ్డు, రైలు, వాయు మార్గాల ద్వారా భక్తులు ప్రయాగ్ రాజ్ చేరుకుంటున్నారు. కుంభమేళాను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యోగీ సర్కార్ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసింది. పేద, ధనిక అనే తేడా లేకుండా అంతా కుంభమేళాలో పాల్గొంటున్నారు.

కాగా, మహా కుంభమేళా 24వ రోజు కొనసాగుతోంది. ఈ కుంభమేళాలో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. గంగ, యమున, సరస్వతి సదులు కలిసే పవిత్ర త్రివేణీ సంగమం లో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కుంభమేళా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ 39 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారు.

జనవరి 13వ తేదీ నుంచి ఫిబ్రవరి 4వ తేదీ వరకూ 39 కోట్ల మంది భక్తులు నదీ స్నానాలు ఆచరించినట్లు యూపీ అధికారులు తెలిపారు. ఇక ఇవాళ ఉదయం 37 లక్షల మందికిపైగా భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించినట్లు పేర్కొన్నారు. అందులో 10 లక్షల మంది కల్పవాసీలు కూడా ఉన్నట్లు వెల్లడించింది. కాగా, సంక్రాంతి సందర్భంగా జనవరి 13న ప్రారంభమైన ఈ మహా కుంభమేలా ఫిబ్రవరి 26 శివరాత్రితో ముగుస్తుంది. 45 రోజులపాటు సాగే ఈ కుంభమేళాలకు దాదాపు 50 కోట్ల మంది హాజరవుతారని యూపీ సర్కార్‌ అంచనా వేస్తోంది. అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేసింది.


Tags

Next Story