PM Modi: నేడు ఫ్రాన్స్, అమెరికా పర్యటనకు మోడీ..

PM Modi: నేడు ఫ్రాన్స్, అమెరికా పర్యటనకు మోడీ..
X
ట్రంప్‌తో సమావేశం కానున్న ప్రధాని

ప్రధాని మోడీ ఈరోజు రెండు దేశాల పర్యటనకు వెళ్తున్నారు. ఫ్రాన్స్, అమెరికాలో మోడీ పర్యటించనున్నారు. ఫిబ్రవరి 11న ఏఐ సమ్మిట్‌కు ప్రధాని మోడీ అధ్యక్షత వహించనున్నారు. ఫ్రాన్స్ అభ్యర్థన మేరకు మోడీ.. ఏఐ సమ్మిట్‌కు అధ్యక్షత వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో అమెరికా ఉపాధ్యక్షుడు, చైనా ప్రతినిధులు హాజరుకానున్నారు. ఇక ఫిబ్రవరి 12న ఫ్రాన్స్ వీవీఐపీ విందు ఇవ్వబోతుంది. ఈ విందులో కూడా ప్రధాని మోడీ పాల్గొననున్నారు. ఇక ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌తో కూడా భేటీ అయి ఇరు దేశాల సంబంధాలపై చర్చించనున్నారు. పర్యటనలో భాగంగా థర్మో న్యూక్లియర్‌ యాక్టర్‌ను కూడా మోడీ సందర్శించనున్నారు.

అనంతరం ఫ్రాన్స్ నుంచి మోడీ అమెరికా వెళ్లనున్నారు. 12, 13 తేదీల్లో అమెరికాలో పర్యటించనున్నారు. అధ్యక్షుడు ట్రంప్‌తో సమావేశం కానున్నారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక.. ఆయన్ను కలిసిన ప్రపంచ నాయకుల్లో అతి కొద్ది మందిలో మోడీ ఒకరు కావడం విశేషం. అంతేకాకుండా కొన్ని రోజులకే అమెరికా నుంచి మోడీకి ఆహ్వానం రావడం ప్రాముఖ్యతను సంతరించుకుంది.

Tags

Next Story