కరోనా వ్యాక్సిన్‌ పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

కరోనా వ్యాక్సిన్‌ పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
కరోనా వ్యాక్సిన్‌ కోసం మరెంతో కాలం ఎదురు చూడాల్సిన అవసరంలేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మరికొన్ని వారాల్లో టీకా అందుబాటులోకి వస్తుందన్నారు..

కరోనా వ్యాక్సిన్‌ కోసం మరెంతో కాలం ఎదురు చూడాల్సిన అవసరంలేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మరికొన్ని వారాల్లో టీకా అందుబాటులోకి వస్తుందన్నారు. అఖిలపక్షాలతో చర్చించిన ఆయన... శాస్త్రవేత్తల నుంచి అనుమతులు రాగానే.. దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. ముందుగా ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌ అయిన వైద్యులు, పోలీసులు, మున్సిపల్‌ సిబ్బందికి టీకా వేస్తామన్నారు. అలాగే వ్యాధులతో బాధపడుతున్న వృద్ధులకు తొలి ప్రాధాన్యతమిస్తామన్నారు. ఇక టీకా ధరపై అనేక ప్రశ్నలు వస్తున్నాయని... ప్రజారోగ్యానికే బీజేపీ కట్టుబడి ఉందన్నారు. వ్యాక్సినేషన్‌లో రాష్ట్రాలను కూడా పూర్తి భాగస్వాములను చేస్తామన్నారు. వ్యాక్సినేషన్‌ పూర్తి వివరాలపై సమీక్షించేందుకు వీలుగా కోవిన్‌ అనే సాఫ్ట్‌వేర్‌ను భారత్‌ సిద్ధం చేసిందని తెలిపారు. ప్రధానంగా 8 టీకాలు ప్రయోగ దశల్లో ఉన్నాయని... భారత్‌లో వాటి ఉత్పత్తికి హామీ లభించిందని తెలిపారు ప్రధాని మోదీ.

Tags

Next Story