MODI TOUR: మరోసారి విదేశాలకు ప్రధాని మోదీ

MODI TOUR: మరోసారి విదేశాలకు ప్రధాని మోదీ
రేపటి నుంచి ప్రధాని మోదీ ఫ్రాన్స్‌ పర్యటన.... బాస్టిల్‌ డే వేడుకల్లో పాల్గొననున్న మోదీ.. అబుదాబిలోనూ ప్రధాని పర్యటన...

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. జూలై 13, 14 తేదీల్లో రెండు రోజులు ప్రధాని ఫ్రాన్స్‌లో పర్యటించనున్నారు. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ అహ్వానం మేరకు జులై 14న జరిగే జాతీయ దినోత్సవంలో మోదీ గౌరవ అతిథిగా పాల్గొననున్నారు. మోదీని జులై14 బాస్టిల్‌ డే పరేడ్‌కు స్వాగతించడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని మేక్రాన్‌ ట్వీట్‌ చేశారు. బాస్టిల్‌ డే వేడుకలకు విదేశీ నేతలను ఆహ్వానించండం సాధారణమైన విషయం కాదని, చివరిసారిగా 2017లో బాస్టిల్‌ డే వేడుకలకు అమెరికా అధ్యక్షుడిని ఆహ్వానించారని భారత విదేశాంగ శాఖ తెలిపింది.

ఫ్రాన్స్‌ పర్యటనలో ప్రధాని దిగ్గజ CEOలతో సమావేశం అవుతారని అధ్యక్షుడు మేక్రాన్‌తో ద్వైపాక్షిక సమావేశాలు జరుపుతారని వెల్లడించింది. ప్రపంచ సమస్యలపైనా మేక్రాన్‌-మోదీ చర్చలు జరపనున్నారు. సెనేట్, జాతీయ అసెంబ్లీ అధ్యక్షులతో సహా ఫ్రాన్స్‌లోని కీలక నేతలతోనూ మోదీ భేటీ అవుతారని వెల్లడించింది. వాణిజ్యం మోదీ పర్యటనలో కీలకం కానుందని వివరించింది. ప్రధాని మోదీ గౌరవార్థం మేక్రాన్ విందును కూడా ఏర్పాటు చేశారని విదేశాంగ శాఖ తెలిపింది. వ్యూహాత్మక, సాంస్కృతిక, శాస్త్రీయ, విద్యా, ఆర్థిక సహకారం వంటి విభిన్న రంగాలపైనా ప్రధాని చర్చలు జరపనున్నారు. ఫ్రాన్స్‌లోని భారతీయ ప్రవాసులు, భారతీయులతోనూ మోదీ సమావేశం కానున్నారు.


బాస్టిల్‌ డే వేడుకల్లో భారత సైనిక బృందం కూడా కవాతు చేయనుంది. విస్తృత చర్చ జరగనుంది తెలిపింది. ఫ్రాన్స్‌ జాతీయ దినోత్సవంలో విదేశీ సైనికుల కవాతు, విమాన విన్యాసాలు చేయడం చాలా అరుదని, కానీ వీటిని నిర్వహిస్తోందని విదేశాంగ శాఖ తెలిపింది.


ఫ్రాన్స్‌ పర్యటన ముగిసిన అనంతరం జులై 15న ప్రధాని అబుదాబిలో పర్యటిస్తారు. UAE అధ్యక్షుడు, అబుదాబి పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో మోదీ చర్చలు జరుపుతారు. భారత్-UAEసమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం క్రమంగా బలపడుతోందని విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఇంధనం, విద్య, ఆరోగ్య సంరక్షణ, ఆహార భద్రత, రక్షణ గురించి ప్రధాని మోదీ సౌదీ పాలకులతో చర్చలు జరుపుతారని పేర్కొంది. మోదీ విదేశీ పర్యటనతో భారత్‌కు బహుళ ప్రయోజనాలు కలుగుతాయని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story