రామ మందిరం నిర్మించిన కార్మికులపై ప్రధాని పూల వర్షం

రామ మందిరం నిర్మించిన కార్మికులపై ప్రధాని పూల వర్షం
అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించిన కార్మికులపై ప్రధాని మోదీ పూలు చల్లి తన వినమ్రతను చాటుకున్నారు.

అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించిన కార్మికులపై ప్రధాని మోదీ పూలు చల్లి తన వినమ్రతను చాటుకున్నారు. వెలుగులు విరజిమ్ముతున్న ఆలయ నిర్మాణం శాంతి, సహనం, సామరస్యం, దేశ సమైక్యతకు ప్రతీక అని ప్రధాన మంత్రి అన్నారు. అయోధ్య దేవాలయం రాముడి రూపంలోని జాతీయ చైతన్యానికి సంబంధించిన దేవాలయమని కూడా ప్రధాని అన్నారు.

వేడుకకు నేతృత్వం వహించిన ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో గంటసేపు పూజలు నిర్వహించారు. అనంతరం ప్రాణ్ ప్రతిష్ఠా కార్యక్రమంలో రామ్ లల్లా విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఎర్రటి మడతపెట్టిన దుపట్టాపై ఉంచిన వెండి 'చత్తర్' (గొడుగు)తో ఆలయ ప్రాంగణంలోనికి ప్రధాని నడిచి వచ్చారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా పూజా మందిరంలో ఉన్నారు.

వేడుక నిర్విగ్నంగా జరగడంతో భక్తులు, అతిథులు జై శ్రీరాం అంటూ నినాదాలు చేశారు. రామాలయ ప్రాంగణంలోని జటాయువు విగ్రహంపై కూడా ప్రధాని పుష్పాలు చల్లి, అయోధ్య ధామ్‌లోని శివుడికి ప్రార్థనలు చేశారు. అయోధ్యలోని రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు ఆహ్వానించబడిన ప్రముఖులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తూ, రామ్‌లల్లా విగ్రహావిష్కరణ క్షణం కేవలం విజయోత్సవం మాత్రమే కాదు, వినయం కూడా అని అన్నారు.

“ఇది వేడుకల క్షణం అలాగే భారతీయ సమాజ పరిపక్వతకు ప్రతిబింబం. ఇది కేవలం విజయానికి మాత్రమే కాదు, వినయానికి కూడా ఒక సందర్భం. ఎన్నో దేశాలు తమ చరిత్రలోనే గొంతు చించుకుంటాయని, అలాంటి దేశాలు తమ సమస్యల పరిష్కారానికి ప్రయత్నించినప్పుడు ఇబ్బందులు ఎదుర్కొన్నాయనడానికి ప్రపంచ చరిత్రే నిదర్శనం. కానీ మన దేశం చరిత్రపు ముడులను విప్పిన తీరు మన భవిష్యత్తు మరింతగా ఉన్నతంగా ఉండబోతోందనడానికి నిదర్శనం. మన గతం కంటే అందంగా ఉంది, ”అని మోదీ అతిధులను ఉద్దేశించి ప్రసంగించారు.

Tags

Next Story