గుజరాత్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ప్రధాని

సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రధాని మోదీ గుజరాత్‌లో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా అహ్మదాబాద్ చేరుకున్న మోదీకి గవర్నర్ ఆచార్య దేవవ్రత్, సీఎం విజయ్ రూపాని ఘనం స్వాగతం పలికారు. పటేల్ జయంతి ఉత్సవాల నేపథ్యంలో.. పలు పర్యాటక రంగ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. నర్మద జిల్లాలోని కేవడియాలో అరోగ్య వన్‌ను ప్రారంభించారు. 15 ఎకరాల్లో విస్తరించిన ఈ పార్క్‌లో.. అనేక ఔషధ గుణాలున్న మొక్కలు పెంచుతున్నారు. దీంతోపాటు కేవడియాలో చిల్డ్రన్స్ న్యూట్రిషన్ పార్క్, జంగిల్ సఫారీ ప్రారంభించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సఫారీ వాహనాల్లో విహరిస్తూ.. మోదీ ఉల్లాసంగా గడిపారు. పక్షులను చూస్తూ ఆస్వాదించారు.
ఆ తర్వాత నర్మద డ్యాంలో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ చుట్టూ బోటులో విహరించారు. ఏక్తా నర్సరీ, కాక్టస్ గార్డెన్, నర్మదా డ్యాం లైటింగ్స్, యూనిటీ గ్లో గార్డెన్ లను ప్రారంభించారు. నర్మదా డ్యాం లైట్సింగ్, యూనిటీ గ్లో గార్డెన్.. కళ్లు చెదిరే విద్యద్దీపాలంకరణంతో ఆకట్టుకున్నాయి. గుజరాత్ టూరిజంను ప్రోత్సహించేందుకు.. ఈ కార్యక్రమాలు చేపట్టారు ప్రధాని మోదీ.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com