Maldives : మాల్దీవుల అధ్యక్షుడిగా మొహహ్మద్ మయిజ్జు

Maldives : మాల్దీవుల అధ్యక్షుడిగా మొహహ్మద్ మయిజ్జు
చైనా అనుకూల అభ్యర్థి విజయం

మాల్దీవులలో శనివారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో చైనా అనుకూల అభ్యర్థి మొహమ్మద్ మయిజ్జు విజయం సాధించారు. మాల్దీవ్స్ డెమొక్రటిక్ పార్టీపై ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్ నేత, పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన అభ్యర్థి మయిజ్జు 54.06 శాతం ఓట్లతో గెలుపొందారు. శనివారం అర్దరాత్రి ప్రస్తుత అధ్యక్షుడు ఇబ్రహీం మొహమ్మద్ సోలిహ్ ఓటమిని అంగీకరించారు. 61 ఏళ్ల సోలిహ్ నవంబర్ 17వతేదీన ప్రమాణ స్వీకారం చేసే వరకు తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు.

45 ఏళ్ల మయిజ్జు చైనా దేశానికి అనుకూల వ్యక్తి. కావడంతో ఈ ఎన్నిక మాల్దీవులు, భారత్ మధ్య సంబంధాలపై ప్రభావం చూపించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ సందర్భంగా ‘‘అధ్యక్షుడిగా ఎన్నికైన మయిజ్జుకు అభినందనలు, శాంతియుత, ప్రజాస్వామ్య ప్రక్రియను ప్రదర్శించిన ప్రజలను కూడా నేను అభినందిస్తున్నాను’’ అని సోలిహ్ ఎక్స్ లో రాశారు. ఎన్నికల ప్రచార ఆంక్షలు అధికారికంగా ముగిసే వరకు ఆదివారం ఉదయం వరకు సంబరాలు చేసుకోవద్దని మద్ధతుదారులను ముయిజ్జు కోరారు. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే తూర్పు-పడమర షిప్పింగ్ లేన్‌లలో ఒకటైన హిందూ మహాసముద్రం మధ్యలో మాల్దీవులు ఉంది. మయిజ్జు తన గురువు, మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ నిర్మాణ ప్రాజెక్టుల కోసం చైనా నుంచి భారీగా అప్పులు చేశారు.


గతంలో యమీన్ పై పెరుగుతున్న నిరంకుశ పాలనపై అసంతృప్తి నేపథ్యంలో సోలిహ్ 2018వసంవత్సరంలో ఎన్నికయ్యారు. మాల్దీవుల దేశాన్ని చైనా అప్పుల ఊబిలోకి నెట్టిందని ఆరోపించారు. మయిజ్జు యమీన్‌ను విడిపిస్తానని ప్రమాణం చేశారు. మయిజ్జు తన కార్యనిర్వాహక అధికారాన్ని ఉపయోగించాలని, యమీన్‌ను గృహనిర్బంధానికి తరలించాలని అవుట్‌గోయింగ్ అధ్యక్షుడిని కోరారు. తూర్పు, పశ్చిమ దేశాల నౌకామార్గంలో కీలకంగా ఉన్న ఈ దీవులపై వ్యూహాత్మక ఆధిపత్యం సాధించేందుకు రెండు దేశాలూ ప్రయత్నించాయి. మాల్దీవ్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్న ఇద్దరు అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు దీవుల మధ్య విమానాలు, నౌకల్లో హడావిడిగా తిరిగారు . అందుకే ఎన్నిక ఇద్దరు వ్యక్తులు ఒక దేశం కోసం అన్నట్టు కాక రెండు దేశాలమధ్య అన్నట్టు సాగింది. కానీ చివరికి ఎన్నికల్లో చైనా అనుకూల అభ్యర్థి మొహమ్మద్ మయిజ్జు విజయం సాధించారు.


Tags

Next Story