Ranya Rao: నటి రన్యారావు కోట్ల విలువైన ఆస్తులు జప్తు!

Ranya Rao: నటి రన్యారావు  కోట్ల విలువైన ఆస్తులు జప్తు!
X
స్మగ్లింగ్‌, మనీలాండరింగ్‌ కేసులో చర్యలు

కన్నడ నటి రన్యా రావు కు ఈడీ గట్టి షాక్‌ ఇచ్చింది. బంగారం అక్రమ రవాణా వ్యవహారంతో సంబంధం ఉన్న మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయిన నటికి చెందిన రూ.34 కోట్లకు పైగా విలువైన ఆస్తులను అటాచ్‌ చేసింది. ఈ విషయాన్ని ఈడీ అధికారులు వెల్లడించారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద బెంగళూరులోని విక్టోరియా లేఅవుట్‌లోని నివాస భవనం, అర్కావతి లేఅవుట్‌లోని ఒక నివాస స్థలం, తుమకూరులోని ఇండస్ట్రియల్‌ భూమి, అనేకల్ తాలూకాలోని వ్యవసాయ భూమిని జప్తు చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ ఆస్తుల మార్కెట్‌ విలువ రూ.34.12 కోట్లు ఉంటుందని వెల్లడించారు.

దుబాయ్‌ నుంచి బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ మార్చి తొలి వారంలో రన్యారావు బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఆమె వద్ద నుంచి 14.7 కిలోల బంగారాన్ని డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకొని అరెస్టు చేశారు. గోల్డ్‌ స్మగ్లింగ్‌ రాకెట్‌పై సీబీఐ, డీఆర్‌ఐ అధికారుల ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) ఆమెపై పీఎంఎల్‌ఏ కింద కేసు నమోదు చేసి ముమ్మర దర్యాప్తు కొనసాగిస్తోంది. గోల్డ్‌ స్మగ్లింగ్‌ సిండ్‌కేట్‌లో ఆమె చురుకైన పాత్రను గుర్తించిన ఈడీ.. తాజాగా ఆమె ఆస్తులను జప్తు చేయడం గమనార్హం.

Tags

Next Story