Propose Day 2022: వాలెంటైన్ వీక్ రెండో రోజు.. 'ప్రపోజ్ డే' రోజున ఇలా డిఫరెంట్‌గా ప్రపోజ్ చేస్తారు..

Propose Day 2022: నేడు ఫిబ్రవరి 8.. అంటే రోజులాగానే ఇది కూడా ఒక సాధారణ రోజు. కానీ లవర్స్‌కు అలా కాదు. వారికి మాత్రం ఇది వాలెంటైన్ వీక్‌లో రెండో రోజు. వాలెంటైన్ వీక్‌లో మొదటి రోజు రోజ్ డే అయిపోయిన తర్వాత రెండో రోజు 'ప్రపోజ్ డే' వస్తుంది. ఇది ప్రేమలో ఉన్నవారికే కాదు వన్ సైడ్ లవర్స్‌కు కూడా వారి ప్రేమను వ్యక్తపరచడానికి అవకాశం ఇచ్చే రోజు.
ప్రపోజ్ అంటే మామూలుగా తమ అభిప్రాయాలను వ్యక్తపరచడం. కానీ ఇది మెల్లగా ప్రేమను వ్యక్తపరిచే పదంగా మారిపోయింది. మామూలుగా ప్రపోజల్ అంటే ఏం ఉంటుంది 'ఐ లవ్ యూ' అని చెప్పడమే అనుకుంటారు కొందరు. కానీ అలా సింపుల్‌గా చెప్తే.. చాలామందికి నచ్చకపోవచ్చు కదా.. అందుకే ప్రపోజల్ అనేది కాస్త డిఫరెంట్‌గా ఉంటేనే బెటర్ అనుకుంటారు.
వాలెంటైన్స్ వీక్ అంటేనే సర్‌ప్రైజ్‌లతో నింపేస్తారు. అప్పుడే ప్రేమించిన వారు మరింత ఎక్సైటింగ్‌గా ఎదురుచూస్తారు. అలాగే ప్రపోజల్ కూడా కళ్లు చెదిరేలా ఉండాలని భావిస్తారు. అప్పుడే ఆ ఎక్సైట్‌మెంట్ మరింత పెరుగుతుంది. రింగ్ ఇచ్చి, మోకాళ్ల మీద కూర్చొని ప్రపోజ్ చేయడం అనేది క్లాసిక్ స్టైల్. ఇది ఎప్పటికీ ఔట్‌డేటెడ్ అవ్వదు.
పైగా డిఫరెంట్‌గా ఎలా ప్రపోజ్ చేయాలో ఇప్పటికీ చాలా సినిమాలు చూపించాయి కూడా. ప్రేమించిన వారు అవతలి వారికి ప్రపోజ్ చేస్తున్నట్టుగా తెలియకూడదు. ఒక సర్‌ప్రైజ్ ఈవెంట్ ప్లాన్ చేసి, ఒక విశాలమైన చోటులో దానికి తగిన ఏర్పాట్లు చేసి, ప్రేమించే వారికి ఇష్టమైన వస్తువు ఏదైనా ఇచ్చి ప్రపోజ్ చేయడానికి ట్రై చేస్తే.. ఆ ప్రపోజల్ జీవితంలో ఓ మధురమైన జ్ఞాపకంగా ఉండిపోతుందని భాావిస్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com