ధరల పెరుగుదలకు నిరసన.. తుపాకీతో టమోటాలు కొనుగోలు

ధరల పెరుగుదలకు నిరసనగా మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కార్యకర్తలు బ్రీఫ్‌కేస్, తుపాకీతో టమోటాలు కొనుగోలు చేశారు.పెరుగుతున్న టమాటా ధరలకు నిరసనగా కాంగ్రెస్ కార్యకర్తలు కూరగాయలను కొనుగోలు చేసేందుకు బ్రీఫ్‌కేస్, తుపాకీ పట్టుకున్నారు. టమోటాల ధర చాలా ఎక్కువగా ఉంది. అంత ఖరీదు పెట్టి కొన్న కూరగాయలను ఎవరైనా కొట్టేస్తే అందుకే బ్రీఫ్‌కేస్ తెచ్చుకున్నాము.. దాంతో పాటు మరింత జాగ్రత్తగా ఉండేందుకు తుపాకీని కూడా దగ్గర ఉంచుకున్నాము అని వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు మధ్యప్రదేశ్ కార్యకర్తలు.
మధ్యప్రదేశ్ రాజధాని నగరం భోపాల్‌లో కాంగ్రెస్ కార్యకర్తలు టమోటాల ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా సోమవారం ప్రత్యేక నిరసన చేపట్టారు. గత కొన్ని రోజులుగా దేశంలోని పలు ప్రాంతాల్లో టమాటా ధరలు కిలో రూ.100 దాటాయి.
ఆకాశాన్నంటుతున్న ధరలకు నిరసనగా, కాంగ్రెస్ కార్యకర్తలు బ్రీఫ్‌కేస్ చేతబట్టి, నకిలీ తుపాకీతో కూరగాయలు కొనడానికి భోపాల్‌లోని 5 నంబర్ మార్కెట్‌కి వెళ్లారు. బిజెపి ప్రభుత్వంపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి విక్కీ ఖోంగల్ విరుచుకుపడ్డారు. "కాంగ్రెస్ హయాంలో ద్రవ్యోల్బణాన్ని "దయాన్" (మంత్రగత్తె) అని పిలిచేవారు, ఇప్పుడు బిజెపి పాలనలో అది "డార్లింగ్" (ప్రియమైనది) గా మారింది. అనంతరం కాంగ్రెస్ కార్యకర్తలు తాము కొనుగోలు చేసిన కూరగాయలను పార్టీ కార్యాలయంలో భద్రపరిచారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com