PSLV C52: ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రయోగం.. రేపే ముహూర్తం..

PSLV C52 (tv5news.in)
PSLV C52: ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. 2022లో తొలి ప్రయోగానికి సిద్ధమైంది. పీఎస్‌ఎల్‌వీ- సీ52 వాహకనౌక ప్రయోగాన్ని.. రేపు ఉదయం 5.59 గంటలకు చేపట్టనుంది. ఆదివారం తెల్లవారుజామున 4.29 గంటలకు కౌంట్‌డౌన్ కొనసాగుతోంది. ఇది 25 గంటల 30 నిమిషాలపాటు కొనసాగిన అనంతరం.. పీఎస్‌ఎల్‌వీ వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లనుంది.
1710 కిలోల బరువున్న ఆర్‌ఐశాట్, 1705 కిలోల ఐఎన్‌ఎస్-2టీడీ, 8.1 కిలోల ఇన్‌స్పైట్-1 ఉపగ్రహాలను వాహకనౌక మోసుకెళ్లనుంది. ఇస్రో అధిపతి డాక్టర్ సోమనాథ్ నిన్న షార్‌కు చేరుకొని ఎమ్‌ఆర్‌ఆర్ సమావేశంలో పాల్గొన్నారు. ఇవాళ కూడా ఆయన అక్కడే ఉండి కౌంట్‌డౌన్ ప్రక్రియను పర్యవేక్షించడంతో పాటు.. శాస్త్రవేత్తలతో వివిధ ప్రాజెక్ట్‌లపై సమీక్ష నిర్వహిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com