PT Usha : పీటీ ఉష భర్త వి. శ్రీనివాసన్ హ‌ఠాన్మ‌ర‌ణం

PT Usha :  పీటీ ఉష   భర్త వి. శ్రీనివాసన్ హ‌ఠాన్మ‌ర‌ణం
X
కబడ్డీ క్రీడాకారుడిగా పేరుగాంచిన శ్రీనివాసన్

భారతదేశం గర్వించదగ్గ క్రీడాకారిణి, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు పీటీ ఉష ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె భర్త వెంగళిల్ శ్రీనివాసన్ కన్నుమూశారు. ఆయన వయసు 67 సంవత్సరాలు. నిన్న అర్ధరాత్రి ఆయన కోజికోడ్ జిల్లాలోని తిక్కోడి పెరుమల్పురంలో ఉన్న నివాసంలో అర్ధరాత్రి 1 గంట సమయంలో ఒక్కసారిగా కుప్పకూలారు. కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే సమీపంలో ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆయన అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు ప్రకటించారు. భర్త మరణించిన సమయంలో పీటీ ఉష ఇంట్లో లేరు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఆమె ఢిల్లీలో ఉన్నారు. తన భర్త మరణవార్త తెలియగానే ఆమె వెంటనే ఢిల్లీ నుంచి బయల్దేరి కేరళకు చేరుకున్నారు.

శ్రీనివాసన్ 1991లో పీటీ ఉషతో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరికి ఉజ్వల్ అనే కుమారుడు ఉన్నారు. CISFలో పదవీ విరమణ చేసుకున్నప్పటినుండి, క్రీడా రంగంలో పీటీ ఉషకు మద్దతుగా ఆయన కీలకంగా నిలిచారు. పీటీ ఉష నడిపే ఉష స్కూల్ ఆఫ్ అథ్లెటిక్స్ (Usha School of Athletics) అభివృద్ధిలో, యువ క్రీడాకారుల శిక్షణ, వనరుల ఏర్పాట్లలో శ్రీనివాసన్ చేసిన సహకారం స్ఫూర్తిదాయకంగా నిలిచింది.పీటీ ఉష సాధించిన అంతర్జాతీయ పతకాల వెనుక ఆయన నిరంతర ప్రోత్సాహం, మద్దతు కీలకమైనది. ప్రతి విజయ సందర్భంలో ఆయన భుజంగా నిలిచి, సాయం అందించడం క్రీడా వర్గం గుర్తిస్తున్నది. క్రీడాకారులు, మాజీ క్రీడా ప్రముఖులు, రాజకీయ నాయకులు శ్రీనివాసన్ మృతిని తీవ్రంగా ఆవేదనగా తెలిపారు

శ్రీనివాసన్ విషయానికి వస్తే... ఆయన కబడ్డీ ఆటగాడు. సీఐఎస్ఎఫ్ లో డిప్యూటీ ఎస్పీగా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందారు. పీటీ ఉషకు ఆయన దూరపు బంధువు అవుతారు. 1991లో వీరు వివాహం చేసుకున్నారు. వీరికి ఉజ్వల్ విఘ్నేష్ అనే కుమారుడు ఉన్నాడు. శ్రీనివాసన్ మృతి వార్తతో భారత క్రీడా ప్రపంచంలో విషాదం నెలకొంది. పీటీ ఉషకు క్రీడ, రాజకీయ ప్రముఖుల నుంచి సంతాపాలు వెల్లువెత్తుతున్నాయి.

Tags

Next Story