Rahul Gandhi: పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి బెయిల్

Rahul Gandhi: పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి బెయిల్
X
సావర్కర్ పరువు నష్టం కేసులో

పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి పుణే కోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. 2023 మార్చిలో లండన్‌లో వీరసావర్కర్‌ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యల మీద సావర్కర్ మనవడు సత్యకి సావర్కర్ పుణేలోని కోర్టులో పరువు నష్టం కేసు వేశారు. ఈ కేసుకు సంబంధించి ఈరోజు రాహుల్ గాంధీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు. ఆయనకు రూ.25 వేల పూచీకత్తు బాండ్‌పై ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

సీనియర్ కాంగ్రెస్ నేత మోహన్ జోషి కోర్టు ముందు పూజీకత్తుగా నిలిచారు. రాహుల్ గాంధీ తరుపున వాదించిన న్యాయవాది మిలింద్ పవార్ మాట్లాడుతూ.. కోర్టు ముందు హాజరుకాకుండా రాహుల్ గాంధీకి శాశ్వత మినహాయింపు కూడా ఇచ్చిందని చెప్పారు. దీనిపై ఫిబ్రవరి 18న విచారణ వాయిదా పడింది. 2023 మార్చిలో లండన్‌లో ఏర్పాటు చేసిన ప్రసంగంలో సావర్కర్ రాసిన పుస్తాకాన్ని ప్రస్తావిస్తూ.. ఆయనపై కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై సావర్కర్ మనువడి ఫిర్యాదుతో కేసు నమోదైంది.

Tags

Next Story