Pune Rape Case: పూణే అత్యాచారం కేసులో కీలక మలుపు..

ఐటీ ప్రొఫెషనల్ పై కొరియర్ ఏజెంట్ లైంగిక దాడి చేసినట్లు నమోదైన కేసు కీలక మలుపు తిరిగింది. పుణే పోలీసు కమిషనర్ అమితేశ్ కుమార్ శుక్రవారం మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం, కొంధ్వాలోని ఫ్లాట్‌లో నివసిస్తున్న మహిళ ఇచ్చిన ఫిర్యాదులో, కొరియర్ ఏజెంట్‌నని చెప్పుకున్న గుర్తు తెలియని వ్యక్తి తనపై రసాయనాలు జల్లి, అఘాయిత్యం చేశాడని ఆరోపించారు. అయితే, ఆమె చెప్పిన నిందితుడు కూడా అత్యధిక విద్యార్హతలుగల ప్రొఫెషనలేనని వెల్లడైంది.
వీరిరువురూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు, సుమారు రెండేళ్ల నుంచి ఇరువురికి పరిచయం ఉంది. ఆమె సాక్ష్యంగా చూపిన సెల్ఫీ కూడా ఆమె తన ఫోన్‌ను ఉపయోగించి తీసుకున్నదే. దీనిలో ఆ వ్యక్తి ముఖం స్పష్టంగా కనిపిస్తున్నది. కానీ ఆమె ఆ ఫొటోను ఎడిట్ చేసింది. అతను ఆమెపై ఎటువంటి రసాయనాలను జల్లలేదు. బెదిరింపు మెసేజ్‌ను కూడా ఆమె స్వయంగా టైప్ చేసుకుంది. కమిషనర్ మాట్లాడుతూ.. “ఎటువంటి రసాయన స్ప్రే ఉపయోగించలేదు. ప్రస్తుతం బాలిక మానసిక స్థితి బాగా లేదు. ఈ కేసును ఇంకా దర్యాప్తు చేస్తున్నాం.” అని వెల్లడించారు. కాగా.. ఆ యువతి కళ్యాణినగర్‌లోని ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తోంది. 2022 నుంచి తన తమ్ముడితో కలిసి అద్దె ఫ్లాట్‌లో నివసిస్తోంది. ఈ ఘటన జరిగిన రోజు ఆమె సోదరుడు ఇంట్లో లేడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com