Bhagwant Mann:పంజాబ్ సీఎం రెండో పెళ్లి.. గురుప్రీత్ కౌర్ ఎవరు..?

Bhagwant Mann: పంజాబ్ సీఎం భగవంత్ మాన్ రెండో పెళ్లి చేసుకోబోతున్నారు. డాక్టర్ గుర్‌ప్రీత్ కౌర్‌తో భగవంత్ మాన్ వివాహం రేపు చండీగఢ్‌లో జరగనుంది. ఈ పెళ్లికి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. కుటుంబ సమేతంగా హాజరుకానున్నారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, పంజాబ్ మంత్రులు, సన్నిహితులు హాజరుకానున్నారు.
మొదటి భార్య ఇందర్ ప్రీత్‌కౌర్‌తో మనస్పర్ధలు రావడంతో ఆరేళ్ల క్రితం విడాకులు ఇచ్చారు. ప్రస్తుతం సీఎం భగవంత్ మాన్ మొదటి భార్య, ఇద్దరు పిల్లలు అమెరికాలో ఉంటున్నారు. ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా ఇద్దరు పిల్లలు హాజరయ్యారు. అయితే చాలా కాలంగా గురుప్రీత్ కౌర్ తో భగవంత్ మాన్ ఫ్యామిలీకి మంచి రిలేషన్స్ ఉండడంతో ఈ రెండో పెళ్లిని ఆయన తల్లి, సోదరి ఫిక్స్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com