Punjab governor: రాష్ట్రపతి పాలనకు సిఫారస్‌ చేస్తా

Punjab governor: రాష్ట్రపతి పాలనకు సిఫారస్‌ చేస్తా
పంజాబ్‌ ప్రభుత్వానికి గవర్నర్ హెచ్చరిక... క్రిమినల్‌ చర్యలు కూడా తీసుకుంటానన్న భన్వరీలాల్‌

పంజాబ్‌లో రాష్ట్రపతి పాలనకు సిఫారస్ చేస్తానంటూ ఆ రాష్ట్ర గవర్నర్ భన్వరీలాల్ ఆప్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు(Punjab governor Banwarilal Purohit warns). గతంలో తాను రాసిన లేఖలకు సమాధానం ఇవ్వాలని లేకుంటే రాష్ట్రపతి పాలనకు సిఫారస్ చేయటంతోపాటు(recommend President’s rule ) క్రిమినల్ చర్యలు తీసుకోనున్నట్లు(criminal proceedings ) బెదిరించారు. గతంలో తాను రాసిన లేఖలకు ప్రభుత్వం( CM Bhagwant Mann) సమాధానం ఇవ్వకపోవటం(not getting any reply ) తనను బాధించిందని గవర్నర్ భన్వరీలాల్ పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ కు రాసిన తాజా లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు మీడియాకు లేఖ విడుదల చేశారు.


పంజాబ్ ప్రభుత్వం రాజ్యాంగ బాధ్యతలు నేరవేర్చటంలో విఫలమైందని రాష్ట్రపతికి సిఫారసు చేయనున్నట్లు గవర్నర్ భన్వరీలాల్ హెచ్చరించారు. అధికరణ 356, భారత శిక్షాస్మృతి సెక్షన్ 124ప్రకారం తుదినిర్ణయం తీసుకోవటానికి ముందే తన లేఖల ద్వారా కోరిన సమాచారం పంపాలని సీఎం మాన్ కు సూచించారు. పంజాబ్ లో ఆందోళన కలిగిస్తున్న డ్రగ్స్ సమస్య నియంత్రణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలపై సమాచారం పంపాలని గవర్నర్ భన్వరీలాల్ తాజా లేఖలో కోరారు. లేకుంటే రాజ్యాంగ ప్రకారం చర్యలు తీసుకోవటం తప్ప తనకు మరోమార్గం ఉండదని పేర్కొన్నారు.

గతంలోనూ పంజాబ్‌ గవర్నర్‌ పురోహిత్‌, ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్ మధ్య తీవ్ర వివావాలు నడిచాయి. వీరిద్దరి వివాదం సుప్రీంకోర్టుకు కూడా చేరింది. పంజాబ్‌ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల ప్రారంభంపై సందిగ్థతపై ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. బడ్జెట్‌ సమర్పణ కోసం అసెంబ్లీని సమావేశపరచాలంటూ మంత్రిమండలి సిఫార్సు చేసినా గవర్నర్‌ బన్వారీలాల్‌ పురోహిత్‌ న్యాయ సలహా తీసుకోవాల్సి ఉందంటూ జాప్యం చేస్తున్నారనే ఆరోపణతో పంజాబ్‌లోని ఆప్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ విచారణ సందర్భంగా భగవంత్‌ మాన్‌, గవర్నర్‌ పురోహిత్‌ వ్యవహార శైలిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ పి.ఎస్‌.నరసింహాల ధర్మాసనం ఘాటైన వ్యాఖ్యలు చేసింది. వారిద్దరి వైఖరి రాజ్యాంగ విరుద్ధంగా, అప్రతిష్ఠాకరంగా ఉందని దుయ్యబట్టింది. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు పరిణతి గల రాజనీతిజ్ఞులుగా, హుందాగా నడుచుకోవాల్సి ఉంటుందని హితవు పలికింది. రెండు వైపులా లోపాలున్నాయని సీజేఐ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ అన్నారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తుల మధ్య జరిగే సంవాదం గౌరవప్రదంగా ఉండాలని పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story