PUNJAB: మంత్రిని కాటేసిన పాము...

PUNJAB: మంత్రిని కాటేసిన పాము...
వరద సహాయ చర్యల్లో పాల్గొన్న పంజాబ్‌ మంత్రి హర్జోత్‌సింగ్‌ బైన్స్‌కు పాముకాటు... కోలుకుంటున్న మంత్రి

పంజాబ్ విద్యాశాఖ మంత్రి హర్జోత్‌ సింగ్ బైన్స్‌ (Punjab Minister Harjot Bains Bitten) పాముకాటు(Snake Bite)కు గురయ్యారు. రూపనగర్ జిల్లాలోని ఆనంద్‌పూర్ సాహిబ్ ప్రాంతంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తుండగా( During Rescue Op In Flood-Hit Area) ఆయనను పాము కరిచింది. వరదల ధాటికి పాంగ్, భాక్రా డ్యామ్‌ల నుంచి నీటిని విడుదల చేయగా పంజాబ్‌లో రూప్‌నగర్, గుర్‌దాస్‌పూర్, హోసియాపూర్, కపుర్తలా, ఫిరోజ్‌పూర్ ప్రాంతాలు జలమయమయ్యాయి. మంత్రి హర్జోత్‌ సింగ్ బైన్స్‌ సొంత నియోజకవర్గమైన ఆనంద్‌పూర్ సాహిబ్‌ కూడా వరదలో మునిగింది. మంత్రి తానే స్వయంగా రంగంలోకి దిగి సహాయక చర్యలను పర్యవేక్షిస్తుండగా పాముకాటుకు గురయ్యారు.

ఆగస్టు 15 రాత్రి(August 15 night ) తనను విషపూరిత పాము కాటు వేసిందని మంత్రే స్వయంగా ట్వీట్ చేశారు. సహాయక చర్యల్లో నిమగ్నమైన సమయంలో ఓ విషపూరిత సర్పం కాటేసిందని.. కానీ ప్రజలకు సాయం చేయాలనే తన సంకల్పాన్ని ఈ ఘటన అడ్డుకోలేకపోయిందని మంత్రి ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. భగవంతుడు(God's grace ), ప్రజల ఆశీర్వాదంతో తాను ఇప్పుడు క్షేమంగా ఉన్నానని తెలిపారు. విషం ప్రభావం తగ్గుతోందని, రక్త పరీక్షల్లో అంతా సాధారణమని తేలిందని మంత్రి తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story