Punjab: సీనియర్ ఐఏఎస్ అధికారి కుమారుడు ఆత్మహత్య.. అందరూ చూస్తుండగానే గన్‌తో కాల్చుకొని..

Punjab: సీనియర్ ఐఏఎస్ అధికారి కుమారుడు ఆత్మహత్య.. అందరూ చూస్తుండగానే గన్‌తో కాల్చుకొని..
Punjab: అవినీతి కేసులో ఇటీవల అరెస్టైన ఐఏఎస్‌ అధికారి సంజయ్‌ కుమారుడు కార్తీక్‌ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Punjab: అవినీతి కేసులో ఇటీవల అరెస్టైన సీనియర్ పంజాబ్‌ ఐఏఎస్‌ అధికారి సంజయ్‌ కుమారుడు కార్తీక్‌ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 2008 IAS బ్యాచ్‌కు చెందిన సంజయ్‌... టెండర్ల కేటాయింపులో అవినీతికి పాల్పడ్డారంటూ అభియోగాలు మోపింది విజిలెన్స్‌ బ్యూరో. ఈ కేసులో సోదాల కోసం.. విజిలెన్స్‌ అధికారులు ఆయన ఇంటికి వెళ్లారు. తనిఖీలు చేస్తుండగా సంజయ్‌ కుమారుడు కార్తీక్‌ ఉన్నట్టుండి కాల్చుకుని చనిపోయాడంటున్నారు విజిలెన్స్‌ అధికారులు.

కార్తీక్‌ తన లైసెన్స్‌ గన్‌తో.. కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పంజాబ్‌ పోలీసులు తెలిపారు.మరోవైపు విజిలెన్స్‌ అధికారులే కార్తీక్‌ను వేధించి చంపేశారని ఆరోపిస్తున్నారు కుటుంబసభ్యులు. తన భర్తపైనా తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్‌ చేశారని, ఇప్పుడు తన కుమారుడిని బలితీసుకున్నారంటూ.. కార్తీక్‌ తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు విజిలెన్స్‌ అధికారుల తనిఖీల్లో 12 కిలోల బంగారు, 3 కిలోల వెండితో పాటు నాలుగు ఐఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

Tags

Next Story