KKR vs PBKS: అద్భుత విజయం సాధించిన పంజాబ్

KKR vs PBKS:  అద్భుత విజయం సాధించిన  పంజాబ్
టీ20 క్రికెట్లోనే అత్యధిక లక్ష్య ఛేదన

పరుగుల సునామీకి ప్రపంచ పొట్టి క్రికెట్‌లో రికార్డులన్నీ మూగబోయాయి. సొంత ఇలాఖాలో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మొదట బ్యాటింగ్‌ చేస్తూ 261 పరుగులు చేసినా.. భారీ ఛేదనను పంజాబ్‌ 18.4 ఓవర్లోనే పూర్తిచేసి పొట్టి ఫార్మాట్‌ చరిత్రలో సరికొత్త రికార్డును సృష్టించింది.. కోల్కతాతో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ సంచలనం సృష్టించింది. 262 పరుగుల లక్ష్యాన్ని 18.4 ఓవర్లలోనే చేధించి రికార్డు సృష్టించింది. 262 పరుగుల టార్గెట్ ను పంజాబ్ బ్యాటర్లు చితక్కొట్టారు. కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి కోల్కతా బౌలర్లకు తమ హోంగ్రౌండ్ లో చుక్కలు చూపించారు. బ్యాటింగ్ కు వచ్చినోళ్లు వచ్చినోళ్లు సిక్సర్ల వర్షం కురిపించారు. 262 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్.. ఓపెనర్లు ప్రభ్ సిమ్రాన్ అర్థసెంచరీతో అదరగొట్టాడు.

ఆ తర్వాత జానీ బెయిర్ స్టో 108 పరుగులతో చెలరేగాడు. అతని ఇన్నింగ్స్ లో 9 సిక్సులు, 8 ఫోర్లు ఉన్నాయి. ఆ తర్వాత రీలే రోసో (26) పరుగులు చేశాడు. ఆ తర్వాత శశాంక్ సింగ్ (68) పరుగులతో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అతని ఇన్నింగ్స్ లో 8 సిక్సులు, 2 ఫోర్లు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ లో అత్యధికంగా 42 సిక్సులు నమోదయ్యాయి. కోల్కతా బౌలింగ్ లో కేవలం సునీల్ నరైన్ ఒక్కడే ఒక్క వికెట్ తీశాడు. మిగతా బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. కోల్కతా భారీ స్కోరు చేసినప్పటికీ.. ఓడిపోయింది. పంజాబ్ ఈ స్కోరును చేధించడంతో రికార్డ్ నమోదు చేసింది.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 261 స్కోరును సాధించింది. కేకేఆర్ బ్యాటర్లలో ఓపెనర్లు సాల్ట్, సునీల్ నరైన్ లు రెచ్చిపోయారు. వీరిద్దరూ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ఫిల్ సాల్ట్ 37 బంతులతో 6 ఫోర్స్, 6 సిక్సుల సహాయంతో 75 పరుగులను రాబట్టగా.. మరోవైపు ఆల్ రౌండర్ సునీల్ నరైన్ మరోసారి తనదైన బ్యాటింగ్ స్టైల్ తో కేవలం 32 బంతులలో 9 ఫోర్లు, 4 సిక్సర్ల సహాయంతో 71 పరుగులను చేశాడు. దాంతో మొదటి వికెట్ కు 137 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొంది. వెంకటేష్ అయ్యర్ 39 పరుగులు, ఆండ్రు రస్సెల్ 12, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 28 పరుగులతో కేకేఆర్ భారీ స్కోరును చేయగలిగింది. పంజాబ్ బౌలర్స్ విషయానికి వస్తే.. అర్షదీప్ సింగ్ 2 వికెట్లు, సామ్ కరణ్, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్లు చెరో వికెట్ తీశారు.

Tags

Next Story