Punjabi Beggar Raju: చలితో వణికిపోతున్న వారికి.. 500 బ్లాంకెట్లు దానం చేసిన యాచకుడు

ఉత్తర భారత్‌లో ప్రస్తుతం చలి చంపేస్తున్నది. జనం గజగజ వణికిపోతున్నారు. కానీ ఓ యాచకుడు తన ఔదర్యాన్ని చాటాడు. పెద్ద మనుసుతో నిరాశ్రయులకు చేయూతనిస్తున్నాడు. భిక్షం ఎత్తుకున్న డబ్బుతోనే ప్రజాసేవకు పూనుకున్నాడు. పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌కు చెందిన రాజు.. యాచనతో వచ్చిన డబ్బుతో బ్లాంకెట్లు కొన్నాడు. సుమారు 500 బ్లాంకెట్లు దానం చేశాడతను. అతిశీతల ఉష్ణోగ్రతలతో ఇబ్బందిపడుతున్న వారిని ఆదుకోవాలన్న తపనతో బ్లాంకెట్ లంగర్‌ను ఏర్పాటు చేశాడు. తన వద్ద ఉన్నది కొంచమే అయినా.. ఇళ్లు లేని వారికి, నిరుపేదలకు బ్లాంకెట్లు దానం చేశాడు. అతని నిస్వార్థ సేవ స్థానికులను గుండెల్ని కదిలిస్తోంది.
కోవిడ్ మహామ్మారి సమయంలోనూ యాచకుడు రాజు తన గొప్ప తనాన్ని చాటుకున్నారు. అవసరమైన వారిని ఆదుకున్నారు. ప్రధాని మోదీ తన మన్‌కీ బాత్ ప్రోగ్రామ్‌లోనూ రాజు గురించి చెప్పారు. తాజాగా రాజు మీడియాతో మాట్లాడాడు. చిన్న చిన్నగా డబ్బులు సేకరిస్తున్నట్లు చెప్పాడు. ఎంత చిన్న అమౌంట్ అయినా తీసుకుని బ్లాంకెట్లు కొన్నట్లు చెప్పాడు. పేదలను ఆదుకోవాలన్న శక్తిని భవంతుడు తనకు ఇచ్చినట్లు తెలిపాడు. అయితే తనకు పర్మనెంట్ ఇళ్లు లేదని, దాని కోసం ప్రభుత్వం వద్ద అర్జీ పెట్టుకున్నట్లు చెప్పాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

