Pappu Yadav : ఎంపీ పప్పు యాదవ్‌పై ఎఫ్‌ఐఆర్

పూర్నియా లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ రెండింటినీ ఓడించి గెలిచిన పప్పు యాదవ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. సోమవారం, జూన్ 10న ముఫాసిల్ పోలీస్ స్టేషన్‌లో ఓ వ్యాపారి ఫిర్యాదు చేశారు. రాజేష్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్ నుండి కోటి రూపాయల దోపిడీ మొత్తాన్ని డిమాండ్ చేసినట్లు వ్యాపారి ఆరోపించారు. దీంతో పాటు హత్య బెదిరింపులు కూడా వచ్చాయి అన్నారు. లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు రోజున (జూన్ 4న) తన ఇంటికి పిలిపించి రూ.కోటి ఇవ్వాలని డిమాండ్ చేశాడని, లేకపోతే చంపేస్తానని బెదించాడని ఆ వ్యాపారి ఫిర్యాదులో పేర్కొన్నాడు. వచ్చే ఐదేండ్లు తాను ఎంపీగా ఉంటానని హెచ్చరించాడని వెల్లడించాడు. ఈ నేపథ్యంలో జూన్ 10న పూర్నియా జిల్లా పోలీసులు పప్పు యాదవ్‌పై కేసు ఫైల్ చేశారు.
గతంలో కూడా పప్పు యాదవ్‌పై ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. 2021, 2023లో కూడా ఇలాగే డిమాండ్ చేశారని పోలీసులు తెలిపారు. అయితే ఈసారి కూడా డబ్బులు ఇవ్వకుంటే చంపేస్తానని యాదవ్ బెదిరించడంతో పాటు వచ్చే ఐదేళ్లపాటు ఎంపీతో వ్యవహరించాల్సి ఉంటుందని హెచ్చరించారని చెప్పారు. వ్యాపారి ఫిర్యాదు ఆధారంగా ఎంపీ, అతని సహచరుడు అమిత్ యాదవ్‌పై కూడా కేసు నమోదు చేశామని, దర్యాప్తు ప్రారంభించామన్నారు.
కాంగ్రెస్ నేత అయిన పప్పు యాదవ్ ఇటీల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పూర్నియా స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. రెండుసార్లు ఎంపీగా విజయం సాధించిన జేడీయూ నేత సంతోశ్ కుష్వాహాను ఓడించారు. పొత్తులో భాగంగా పూర్నియా టికెట్‌ను ఆర్జేడీకి ఇచ్చింది. దీంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకిదిగారు. కాగా, తాను కాంగ్రెస్ పార్టీ అనుబంధ సభ్యుడిగా కొనసాగుతానని, ఇండియా కూటమికే తన మద్దతుని పప్పు యాదవ్ ప్రకటించారు. ఈనేపథ్యంలో జూన్ 10న కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీని కలిశారు. దీంతో కాంగ్రెస్ ఎంపీల సంఖ్య 101కి చేరింది. ఇంతలోనే ఆయనపై కేసు నమోదుకావడం గమనార్హం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com