Tamilnadu: ఆసక్తిని రేకెత్తిస్తున్న తమిళనాడు విరుధ్‌నగర్‌ లోక్‌సభ స్థానం

Tamilnadu: ఆసక్తిని రేకెత్తిస్తున్న తమిళనాడు  విరుధ్‌నగర్‌  లోక్‌సభ స్థానం
రసవత్తరంగా ముక్కోణపు పోరు

తమిళనాడులోని విరుధ్‌నగర్‌ లోక్‌సభ స్థానంలో ఎన్నికలు ఆసక్తి రేతెత్తిస్తున్నాయి.దేశంలో టపాసుల తయారీకి హబ్‌గా ఉన్న ఈ నియోజకవర్గం రాజకీయంగానూమోత మోగించేందుకు వేదికైంది. ప్రముఖ సీనియర్‌ నటి రాధికా శరత్‌కుమార్‌ ఈ నియోజకవర్గంలో భాజపా తరఫున పోటీ చేస్తుండగా..AIADMK, DMK ఉమ్మడి అభ్యర్థిగా సీనియర్‌ నటుడు, DMK వ్యవస్థాపక అధ్యక్షుడు. దివంగత విజయకాంత్‌ కుమారుడు విజయ ప్రభాకరన్ రంగంలోకి దిగారు. అధికార DMK-కాంగ్రెస్‌ కూటమి తరఫున.. సిట్టింగ్ ఎంపీ మాణిక్కం ఠాగూర్‌..మరోసారి పోటీ పడుతున్నారు. కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్‌కు ఈ నియోజకవర్గంపై గట్టి పట్టుంది. 2009లోకాంగ్రెస్‌ అభ్యర్థిగా విజయం సాధించిన ఠాగూర్‌... 2014లో ఓడినప్పటికీ, 2019లో తిరిగి గెలుపొందారు. అసెంబ్లీ నియోజకవర్గాల పరంగా చూసినా మొత్తం ఆరు స్థానాలకు నాలుగుచోట్ల DMK, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలే ఉన్నారు.

విరుధ్‌నగర్‌లో తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండడం వల్ల రాధిక ఈ నియోజకవర్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. విరుధ్‌నగర్‌ నుంచి తన భార్యను ఎంపీని చేయడమే తన లక్ష్యమని చెప్పిన శరత్‌కుమార్‌ ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండి నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేస్తానని ప్రచారంలో చెబుతున్నారు. ఎలాంటి సమస్య ఎదురైనా తన భర్త శరత్‌కుమార్‌ సాయంతో పరిష్కరిస్తాననిరాధిక ఓటర్లకు హామీ ఇస్తున్నారు. గతంలో విజయకాంత్‌ సరసన అనేక సినిమాల్లో నటించిన రాధిక తాజాగా ఆయన కుమారుడు ప్రభాకరన్‌ తనపై పోటీ చేస్తుండడంపై స్పందించారు. ప్రభాకరన్ తనకు కుమారుడితో సమానమని పేర్కొన్నారు.

మరోవైపు విజయకాంత్‌ మరణం తర్వాతఆయన స్థాపించిన DMDK పార్టీ బాధ్యతలు తీసుకున్న ప్రభాకరన్తా తాజాగా AIADMKతో పొత్తుపొట్టుకొని సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి దిగారు. ఆయన కూడా సినిమా డైలాగులతో ప్రచారంలో దూసుకెళుతున్నారు. రాధిక తనను కుమారుడిగా సంభోదించడంపై స్పందించిన ఆయన రాధిక అమ్మతోపాటు నియోజకవర్గంలో ఉన్న మహిళలంతా తనను వారి బిడ్డ మాదిరిగానే చూస్తారని పేర్కొన్నారు. రాధిక తనను కుమారుడిగా భావిస్తున్నందుకు..ఆమెకు కృతజ్ఞతలు చెప్పిన ప్రభాకరన్ తమ రెండు కుటుంబాలకు మంచి అనుబంధం ఉందని తెలిపారు. ఇదే సమయంలో తన తండ్రి విజయకాంత్‌ తనకు అప్పగించిన పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని స్పష్టం చేశారు.

అయితే రాధిక, ప్రభాకరన్ స్థానికులు కాకపోవడం వారికి ఇబ్బందికరంగా మారింది. అటు విరుధ్‌నగర్‌లో రెండుసార్లు ఎంపీగా గెలిచిన మాణిక్కం ఠాగూర్‌..స్థానికుడు కావడం సహా పార్టీకి సంప్రదాయ ఓటుబ్యాంకు ఎక్కువగా ఉండడం కలిసి వస్తోంది. మిత్రపక్షం DMK సంస్థాగతంగా బలీయంగా ఉండడం కూడా ఆయనకు అనుకూల వాతావరణం కల్పించింది. కాంగ్రెస్‌కు చెందిన మాజీ సీఎం కామరాజ్‌ కూడా విరుధ్‌నగర్‌కు చెందిన నాయకుడు కావడం కూడా కలిసొచ్చింది. కుల సమీకరణ పరంగానూ మాణిక్కం ఠాగూర్వ ర్గం ముక్కులాథోర్లు ఈ నియోజకవర్గంలో చెప్పుకోదగిన స్థాయిలో ఉన్నారు. తన ప్రత్యర్థులు స్థానికేతరులు అనే వాదనను తోసిపుచ్చిన ఠాగూర్.రాజకీయాల్లో ఇద్దరూ ఇప్పుడిప్పుడే నడక నేర్చుకుంటున్నారని నియోజకవర్గ స్వరూపం తెలుసుకునేలోపేవారికి పుణ్యకాలం పూర్తవుతుందని ఎద్దేవా చేశారు.

Tags

Read MoreRead Less
Next Story