India’s borders : భారత సరిహద్దు పోర్టుల్లో నిఘా వ్యవస్థ పటిష్టం

India’s borders : భారత సరిహద్దు పోర్టుల్లో నిఘా వ్యవస్థ పటిష్టం
X
పోర్టుల్లో రేడియేషన్ డిటెక్షన్ పరికరాలు

సరిహద్దుల్లో నిఘా వ్యవస్థను మరింత పటిష్ఠపరచడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ముఖ్యంగా విదేశాల నుంచి రేడియోధార్మిక పదార్థాల అక్రమ రవాణా అడ్డుకట్టకు చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా పాకిస్తాన్తో సహా బంగ్లాదేశ్, మయన్మార్, నేపాల్లతో ఉన్న ఎనిమిది సరిహద్దు చెక్ పోస్టుల్లో రేడియేషన్ డిటెక్షన్ పరికరాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. అణు పరికరాల తయారీ కోసం ఈ రేడియోధార్మిక పదార్థాలు దుర్వినియోగం చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ వ్యవస్థను అందుబాటులోకి తేనుంది.

రేడియేషన్ డిటెక్షన్ పరికరాలను పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్‌లతో భారతదేశం యొక్క సరిహద్దుల వెంట ఉన్న 8 ల్యాండ్ పోర్ట్‌లలో అమర్చనున్నారు. అణు పరికరాల తయారీలో ఉపయోగించే రేడియోధార్మిక పదార్థాల అక్రమ రవాణాను తనిఖీ చేయడానికి వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఈ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్‌లు అట్టారీ (పాకిస్తాన్ సరిహద్దు), పెట్రాపోల్, అగర్తలా, దవ్కీ, సుతార్‌కండి (బంగ్లాదేశ్ సరిహద్దు), రాక్సాల్, జోగ్బానీ (నేపాల్), మోరే (మయన్మార్) ల్యాండ్ పోర్ట్‌లలో అమర్చనున్నారు. రేడియేషన్ డిటెక్షన్ పరికరాల ఇన్‌స్టాలేషన్, నిర్వహణ కోసం వర్క్ ఆర్డర్‌ను ప్రభుత్వం గత సంవత్సరం ఇచ్చింది. త్వరలో ఇన్‌స్టాలేషన్ ప్రక్రియను పూర్తి చేస్తారని ఆర్మీవర్గాలు వెల్లడించాయి.


ఈ పరికరాల సరఫరా, ఏర్పాటు, నిర్వహణ కోసం ప్రభుత్వ ఇప్పటికే ఒప్పందం చేసుకుందని, త్వరలోనే ఈ ప్రక్రియను పూర్తిచేయనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అంతర్జాతీయ సరిహద్దు చెకోపోస్టుల్లో ప్రజల, వస్తువుల కదలికలను ఈ ఎనిమిది ఐసీపీల ద్వారా పర్యవేక్షించవచ్చు. ట్రక్కులతోపాటు ఇతర వస్తురవాణా మార్గాల్లో వీటిని ఏర్పాటు చేస్తారు. ప్రత్యేక అలారం వ్యవస్థతోపాటు అనుమానిత వస్తువులు వీడియో ఫ్రేములను రూపొందించే సామర్థ్యం వీటికి ఉంటుంది. ఈ వ్యవస్థతో అంతర్జాతీయ సరిహద్దుల నుంచి రేడియోధార్మిక పదార్థాలను అక్రమంగా తరలించే ప్రక్రియకు అడ్డుకట్ట వేయొచ్చని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ సాంకేతిక కోసం అమెరికాతోపాటు ఇతర దేశాల ఏజెన్సీల సహాయాన్ని తీసుకుంటోంది. రేడియోధార్మిక పదార్థాల అక్రమ రవాణా భారత భద్రతా సంస్థలకు సవాలుగా మారిన నేపథ్యంలో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ట్రక్కులు, డ్రైవ్-త్రూ మానిటరింగ్ స్టేషన్‌లో రేడియేషన్ డిటెక్షన్ పరికరాలను ఇన్‌స్టాల్ చేయనున్నారు.

Tags

Next Story