India-France: రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు డీల్..!

ఫ్రాన్స్‌తో భారత్ బిగ్ డీల్ కుదుర్చుకుంది. రూ. 63,000 కోట్లతో 26 రాఫెల్-ఎం జెట్ల కొనుగోలుకు భారత్ ఆమోదం తెలిపింది. తాజా ఒప్పందంతో భారత నావికాదళానికి 22 సింగిల్-సీటర్, నాలుగు ట్విన్-సీటర్ విమానాలు రానున్నాయని అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. ఫ్రాన్స్‌తో భారత్ ఒక మెగా ఒప్పందం చేసుకుందని ప్రభుత్వ వర్గాలు తాజాగా వెల్లడించాయి. రూ.63,000 కోట్లకు పైగా విలువైన ఒప్పందంపై త్వరలో సంతకాలు జరుగుతాయని వర్గాలు పేర్కొన్నాయి. ఈ నెల చివరిలో ఫ్రెంచ్ రక్షణ మంత్రి సెబాస్టియన్ లెకోర్ను భారతదేశాన్ని సందర్శించినున్నారు. ఈ సందర్భంగా ఒప్పందంపై సంతకం చేసే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి.
2023, జూలైలో రక్షణ మంత్రిత్వ శాఖ.. ఫ్రాన్స్ నుంచి రాఫెల్-ఎం జెట్ల కొనుగోలుకు ఆమోదం తెలిపింది. దేశీయంగా తయారైన ఐఎన్ఎస్ విక్రాంత్‌తో కలిసి ఈ రాఫెల్ ఎం జెట్‌లు పని చేయనున్నాయి. ఒప్పందం తర్వాత 37 నుంచి 65 నెలల్లో రాఫెల్ విమానాలు డెలివరీ అవుతాయి. హిందూ మహాసముద్రంలో చైనా ఉనికి పెరుగుతున్న నేపథ్యంలో భారత్ అప్రమత్తం అయింది. రాఫెల్ ఎం జెట్ విమానాల రాకతో సముద్రంలో గస్తీ పెంచడానికి ఉపయోగపడనున్నాయి. పొరుగువారి నుంచి ముప్పులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండేందుకే ఈ విమానాలు కొనుగోలు చేస్తున్నట్లు నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠి తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com