Raghav Chadha: ఫోర్జరీ ఆరోపణలతో ఉలిక్కపడ్డ పార్లమెంట్

Raghav Chadha: ఫోర్జరీ ఆరోపణలతో ఉలిక్కపడ్డ పార్లమెంట్
వివాదంలో ఆప్‌ ఎంపీ రాఘవ్‌ చద్దా... తమ సంతకాలు చద్దా ఫోర్జరీ చేశారన్న ఎంపీలు..

ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్‌ ఛద్దా వివాదంలో చిక్కుకున్నారు. ఢిల్లీ సర్వీసెస్ బిల్లు(Delhi Services Bill )ను సెలెక్ట్ కమిటీ(select committee )కి నివేదించాలని కోరుతూ రాఘవ్ ఛద్దా(Raghav Chadha) రాజ్యసభకు సమర్పించిన తీర్మానంపై కొందరు ఎంపీల సంతకాలను ఫోర్జరీ చేసినట్లు‍(Accused Of Forgery‌) ఆయనపై ఆరోపణలు వచ్చాయి. సెలెక్ట్‌ కమిటీకి పంపాలన్న కోరుతూ సమర్పించిన తీర్మానం అయిదుగురు ఎంపీల సంతకాలను చద్దా ఫోర్జరీ చేశారని( forged signatures of five MPs) ఎంపీలు ఆరోపించారు. ఈ ఆరోపణలపై కఠిన చర్యలు తీసుకుంటామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ చెప్పారు. ఈ ఆరోపణలను ఆమ్‌ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party) ఖండించింది. తీర్మానంపై అసలు ఎంపీల సంతకాలే అవసరం లేదని తెలిపింది.


రాఘవ్ ఛద్దా ప్రతిపాదించిన తీర్మానంపై తమ సంతకాలను ఫోర్జరీ చేశారని ఐదుగురు ఎంపీలు ఆరోపించారు. అనుమతి లేకుండా తమ పేర్లను ఢిల్లీ బిల్లు(Delhi Services Bill) ప్రతిపాదిత సెలక్ట్‌ కమిటీలో చేర్చారని రాజ్యసభ(Rajya Sabha) డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌కు ఎంపీలు ఫిర్యాదు చేశారు. రాఘవ్ చద్దా రాజ్యసభకు సమర్పించిన నోటీసులో పేర్కొన్న ఎంపీల్లో బీజేపీ ఎంపీలు ఎస్ ఫంగ్నోన్ కొన్యక్, నరహరి అమిన్, సుధాంశు త్రివేది; ఏఐఏడీఎంకే ఎంపీ ఎం తంబిదురై, బీజేడీ ఎంపీ సస్మిత్ పాత్రా పేర్లు ఉన్నాయి. తమ సమ్మతి లేకుండా తమ పేర్లను ఈ నోటీసులో చేర్చారని ఈ ఎంపీలు ఆరోపించారు. దీంతో హరివంశ్‌ విచారణకు ఆదేశించారు.

ఎంపీల సంతకాలను ఫోర్జరీ చేసినట్లు వచ్చిన ఆరోపణలపై కఠిన చర్యలు తీసుకుంటామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ చెప్పారు. సంతకాల ఫోర్జరీకి బాధ్యుడైన రాఘవ్‌ చద్దాపై తీర్మానాన్ని ప్రవేశపెడతామని చెప్పారు. దీనిపై క్షుణ్ణంగా దర్యాప్తు జరిపించాలని కేంద్ర మంత్రులు డిమాండ్ చేశారు. బాధ్యులైనవారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఢిల్లీలో ఫోర్జరీ జరుగుతుండటంపై చర్చించుకున్నామని, ఇప్పుడు ఏకంగా పార్లమెంటులోనే ఫోర్జరీకి పాల్పడినట్లు తెలుస్తోందని, దీనిపై సమగ్ర దర్యాప్తు జరగాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా( Union Home Minister Amit Shah) అన్నారు.

ఈ ఆరోణలను ఆప్‌ ఖండించింది. నిబంధనల ప్రకారం.. ఒక బిల్లును సెలక్ట్‌ కమిటీకి పంపించాలని ప్రతిపాదిస్తే.. ఎలాంటి సంతకాలు అవసరం లేదని గుర్తు చేసింది. ఒక వేళ ఆ కమిటీలో భాగం కావాలంటే సదరు సభ్యుని సమ్మతి మాత్రం అవసరమని ఆప్‌ వర్గాలు వెల్లడించాయి. ప్రతిపాదనకు ‘అసలు సంతకాలే అవసరం లేనప్పుడు ఇక ఫోర్జరీ ఎక్కడ జరిగిందని ప్రశ్నించింది.

Tags

Read MoreRead Less
Next Story