Rahul Gandhi Asks EC: దేశానికి ఈసీ సమాధానం చెప్పాలి..

Rahul Gandhi Asks EC: దేశానికి ఈసీ సమాధానం చెప్పాలి..
X
బీజేపీతో EC కుమ్మక్కవుతోందన్న రాహుల్ గాంధీ

లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ కేంద్ర ఎన్నికల సంఘానికి 5 ప్రశ్నలు సంధించారు. దేశానికి ఈసీ ఈ 5 ప్రశ్నలపై కచ్చితంగా సమాధానం చెప్పాలని అన్నారు. ప్రతిపక్షాలకు డిజిటల్ ఓటరు జాబితా ఎందుకు రావడం లేదు? ఏం దాస్తున్నారు?, సీసీటీవీ వీడియో ఆధారాలు ఎందుకు ,ఎవరు చెబితే నాశనం చేయబడుతున్నాయి?, నకిలీ ఓటింగ్ ఓటర్ల జాబితాను తారుమారు చేయడం జరిగింది ఎందుకు?, ప్రతిపక్ష నాయకులను బెదిరించడం ఎందుకు?, ఈసీ ఇప్పుడు BJP ఏజెంట్‌గా మారిందా స్పష్టంగా చెప్పండి?. భారతదేశ ప్రజాస్వామ్యం అమూల్యమైనదని ఆయన పేర్కొన్నారు.

ఆధారాలను తుడిచిపెట్టే యత్నాల్లో ఈసీ..

రాహుల్ గాంధీ ఈసీపై సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ, ఈసీ కుమ్మకై ఎన్నికల్లో ‘భారీ నేరపూరిత మోసానికి పాల్పడ్డాయని అన్నారు. ‘ఓట్ల చోరీ విధానం’ దేశవ్యాప్తంగా లోక్సభ, శాసనసభ ఎన్నికల సందర్భంగా అనేక నియోజకవర్గాల్లో కొనసాగిందన్నారు. ఎన్నికల ఫలితం చోరీకి గురైందన్న కాంగ్రెస్ అనుమానాలను గతేడాది మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ధ్రువీకరించాయన్నారు. తమ పార్టీ పరిశోధించి ఆధారాలు సేకరించిందని, దేశవ్యాప్తంగా అటువంటి ఆధారాలను తుడిచిపెట్టే యత్నాల్లో ఈసీ తలమునకలై ఉందని ఆరోపించారు. వెంటనే ఈ వ్యవహారంలో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోవాల్సిన కోరారు. 2024 లోక్సభ ఎన్నికలకు సంబంధించి బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని మహాదేవపుర శాసనసభ స్థానానికి చెందిన ఓటర్ల జాబితాను తమ పార్టీ విశ్లేషిస్తే 1,00,250 ఓట్లు చోరీకి గురైనట్లు తేలిందన్నారు. ఈ నియోజకవర్గంలో 11,965 డూప్లికేట్ ఓటర్లు ఉండగా, 40,009 మంది తప్పుడు చిరునామాలు సమర్పించారని, 10,452 మంది ఒకే చిరునామాలో ఉన్నారని, 4,132 మంది ఓటర్లవి తప్పుడు ఫొటోలున్నాయని, 33,692 మంది ఫారం-6ను దుర్వినియోగం చేశారని ఆరోపించారు. దేశవ్యాప్తంగా భారీ నేరపూరిత మోసం జరిగిందన్న విషయం ప్రజలంతా తెలుసుకోవాలి. ఈసీ, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కలిసి ఈ అక్రమానికి పాల్పడ్డాయని రాహుల్ గాంధీ అన్నారు. గత 15 ఏళ్ల ఎన్నికలు డేటా, సీసీ టీవీ ఫుటేజ్ ఇవ్వకపోతే ఈసీ నేరానికి పాల్పడినట్టేనని అన్నారు.

ఎందుకు జాప్యం చేస్తున్నారు?

అయితే బిహార్​లో ఎస్​ఐఆర్​ ముగిసిన తరువాత, ఓటర్ల జాబితాలో పేర్లను చేర్చమని, లేదా తొలగించమని ఏ రాజకీయ పార్టీ తమను సంప్రదించలేదని ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేసింది. అంతేకాదు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇప్పుడు ఎందుకు అభ్యంతరాలు లేవనెత్తడం లేదని ప్రశ్నించింది.

"రాహుల్ గాంధీ ఎప్పటిలాగే, ఈసీ ప్రశ్నలకు, బిహార్​ ఎన్నికల తరువాతే బదులు ఇస్తారని తెలుస్తోంది" అని ఓ ఎన్నికల అధికారి ఎద్దేవా చేశారు.

కర్ణాటక, మహారాష్ట్ర, హరియాణాల్లో ఓట్ల చోరీ జరిగిందని లోక్​సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించిన నేపథ్యంలో ఈసీ ఈ విధంగా ప్రతిస్పందించింది.

Tags

Next Story