Bharath Jodo Yatra 2: భారత్ జోడో యాత్ర-2.0కు రాహుల్ రెడీ

Bharath Jodo Yatra 2: భారత్ జోడో యాత్ర-2.0కు రాహుల్ రెడీ
యాత్రను సెప్టెంబర్‌లో ప్రారంభించాలని భావిస్తోన్న యంత్రాంగం

కాంగ్రెస్​లో కొత్త జోష్‌ నింపిన భారత్ జోడో కు కొనసాగింపుగా రెండో విడుతను ప్లాన్‌ చేస్తోంది కాంగ్రెస్‌. 2024 సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో ఈ యాత్రను చేపట్టేందుకు సన్నాహాలు చేస్తుంది. యాత్రను సెప్టెంబర్‌లో ప్రారంభించాలని భావిస్తోంది.కాంగ్రెస్‌ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ నేతృత్వంలోని భారత్ జోడో యాత్ర సమన్వయ కమిటీ సమావేశమైంది.యాత్ర ప్రారంభ తేదీతో పాటు స్థలం ఎంపికపై తీవ్రంగా చర్చించారు.అంతకుముందు కన్యాకుమారి నుంచి కశ్మీర్​ వరకు పాదయాత్ర సాగగా..ఇప్పుడు పశ్చిమం నుంచి తూర్పునకు యాత్ర చేపట్టేందుకు సన్నాహాలు చేస్తోంది కాంగ్రెస్​. గుజరాత్​లోని పోర్​బందర్ నుంచి త్రిపురలోని అగర్తలా వరకు భారత్ జోడో యాత్ర-2 ను చేపట్టాలని భావిస్తోంది హస్తం పార్టీ.

మరోవైపు యాత్రను స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రారంభించాలని కోరుతున్నారు కొంతమంది నేతలు . ఆ రోజు ప్రారంభిస్తే దేశవ్యాప్తంగా భారీ ప్రచారం దక్కే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఇబ్బందులు తలెత్తే అవకాశముందని భావించిన అధిష్ఠానం.. సెప్టెంబర్​కే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.

ఇక తొలి విడత భారత్ జోడో యాత్ర 2022 సెప్టెంబర్‌ 7న కన్యాకుమారిలో మొదలైంది. సుమారు 12 రాష్ట్రాల్లో సాగిన ఈ యాత్ర.. 2023 జనవరి 30న కశ్మీర్‌లోని లాల్‌చౌక్‌లో ముగిసింది. ఈ సుదీర్ఘ యాత్ర 145 రోజుల పాటు 3వేల970 కిలోమీటర్ల మేర సాగింది.

Tags

Read MoreRead Less
Next Story