Rahul Gandhi: విపక్ష నేతగా రాహుల్ గాంధీ

Rahul Gandhi: విపక్ష నేతగా రాహుల్ గాంధీ
X
విపక్ష నేతగా రాహుల్ గాంధీని బలపరిచిన వివిధ పార్టీల ఫ్లోర్ లీడర్లు

లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్‌ గాంధీ ఎంపికయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ(సీపీపీ) చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ మంగళవారం ప్రొటెం స్పీకర్‌ భర్తృహరి మహతాబ్‌కు లేఖ పంపారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగిన విపక్ష ఇండియా కూటమి పార్టీల ఫ్లోర్‌లీడర్ల సమావేశంలో ప్రతిపక్ష నేతగా రాహుల్‌ను ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకొన్నారు. ఇతర నియామకాలపై తదుపరి సమావేశంలో నిర్ణయం తీసుకొంటామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌ తెలిపారు.

మంగళవారం రాయ్‌బరేలీ ఎంపీగా పార్లమెంట్‌లో రాహుల్ గాంధీ ప్రమాణం చేశారు. ఒక చేత్తో రాజ్యాంగం ప్రతిని పట్టుకుని ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం జై రాజ్యాంగం అంటూ నినాదం చేశారు. ఇండియా కూటమి సభ్యులంతా ఇదే మాదిరిగా చేశారు.

Tags

Next Story