Bharat Jodo Yatra : రాహుల్ గాంధీ 'భారత్ జోడో యాత్ర'.. వర్షంలోనూ అదే జోష్..

Bharat Jodo Yatra : రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర.. వర్షంలోనూ అదే జోష్..
Bharat Jodo Yatra : కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కర్ణాటకలోని మాండ్యా జిల్లాలో కొనసాగుతుంది

Bharat Jodo Yatra : కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కర్ణాటకలోని మాండ్యా జిల్లాలో కొనసాగుతుంది. ఇవాళ భారత్‌ జోడో యాత్ర చేరుకుంది.ఓ వైపు వర్షం పడుతున్నా పాదయాత్ర చేస్తున్నారు రాహుల్‌గాంధీ. ఇవాళ భారత్‌ జోడో యాత్రలో కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంక గాంధీ పాల్గొననున్నారు. ప్రియాంక కోసం మాండ్యా జిల్లా వాసులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.నిన్న పాదయాత్రలో సోనియా గాంధీ పాల్గొనటంతో జోడో యాత్రకు మరింత జోష్‌ వచ్చింది. ఇవాళ ప్రియాంకగాంధీ వస్తుండటంతో కాంగ్రెస్‌ కేడర్‌ మరింత ఉత్సాహంతో ఏర్పాట్లు చేస్తున్నారు.

28వ రోజు భారత్‌ జోడో యాత్ర ఉదయం ఏడు గంటలకు K. మాలేన హళ్లి నుంచి ప్రారంభమైంది.. రాహుల్‌ పాదయాత్రకు జిల్లా కాంగ్రెస్‌ కమిటీ భారీ ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్‌ నేతలు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఉదయం 11 గంటలకు అంచే చింతన హళ్లిలో మార్నింగ్‌ బ్రేక్‌ ఇచ్చారు.అక్కడ కాసేపువిశ్రాంతి తీసుకొని స్థానిక టౌన్‌ హాల్‌లో రాహుల్‌ స్థానికులతో సమావేశం అయ్యారు.. ఆ తరువాత కాంగ్రెస్‌ కార్యకర్తలుతో చిట్‌చాట్‌ చేశారు రాహుల్‌.


తిరిగి మధ్యాహ్నానం నాలుగు గంటలకు టౌన్‌ బస్‌స్టాండ్‌ నుంచి పాదయాత్ర మొదలై బెళ్లూరు టౌన్‌ వరకు కొనసాగనుంది. అక్కడ స్థానిక కాంగ్రెస్‌ కార్యకర్తలు ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించనున్నారు రాహుల్‌. 28వ రోజు బెళ్లూరులో భారత్‌ జోడో యాత్ర ముగియనుంది. రాత్రికి ఆది చుంచానగరిలోని మాతా స్టేడియం దగ్గర రాహుల్‌ బస చేయనున్నారు.


రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ నేత ప్రియాంకగాంధీ పాల్గొననున్నన్నారు.ఇప్పటికే కర్ణాటక చేరుకున్న ప్రియాంక రాహుల్‌తో పాటు జోడోయాత్రలో రాహుల్ పాదయాత్రలో పార్టీ శ్రేణులతోపాటు ప్రజలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొంటున్నారు. వారికి అభివాదం చేసుకుంటూ రాహుల్ ముందుకు సాగుతున్నారు. చిన్నారులు, పెద్దలు రాహుల్ తో కరచాలనం చేసేందుకు పోటీపడుతున్నారు సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపుతున్నారు. పలు ప్రాంతాల్లో రాహుల్ గాంధీ రహదారి పక్కన ఉన్న ప్రజల వద్ద ఆగి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story